స్వామిజీ రాసలీలలు బట్టబయలు.. మహిళలను లోబర్చుకుని..

ప్రతీకాత్మక చిత్రం

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన శ్రీకాంత్ స్వామి.. కొన్నాళ్ల క్రితం స్వామిజీ అవతరామెత్తాడు.తనకు మహిమాన్విత శక్తులు ఉన్నాయని ప్రచారం చేసుకున్నాడు.

  • Share this:
    స్వామిజీల ముసుగులో మహిళల మానప్రాణాలను దోచుకునే దొంగ స్వామిజీలు ఎక్కువైపోయారు.జనాల్లో ఉన్న మూఢ విశ్వాసాలను ఆసరగా చేసుకుని అందినకాడికి దోచుకోవడం.. మహిళలను లైంగికంగా వేధించడం చేస్తున్నారు. స్వామిజీల అసలు గుట్టు తెలియని జనం.. జ్వరమొచ్చినా,కడుపునొచ్చినా..ఆస్పత్రికి బదులు స్వామిజీలను ఆశ్రయించి ఇల్లు,ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలోనే ఇలాంటి ఉదంతమే వెలుగుచూసింది.

    చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన శ్రీకాంత్ స్వామి.. కొన్నాళ్ల క్రితం స్వామిజీ అవతరామెత్తాడు.తనకు మహిమాన్విత శక్తులు ఉన్నాయని ప్రచారం చేసుకున్నాడు. దీంతో చుట్టుపక్కల జనం ఆయన వద్దకు రావడం మొదలుపెట్టారు.అదే అదనుగా భావించి.. శ్రీకాంత్ స్వామి మహిళలు,యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అయితే ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో కొందరు.. సమస్యలు తీరుతాయేమోనన్న మూఢనమ్మకాలతో మరికొందరు.. అతని వెకిలి చేష్టలను బయటపెట్టలేదు. అయితే ఇటీవల కొన్ని ఫోటోలు వెలుగులోకి రావడంతో.. అతని ఉదంతం బట్టబయలైంది.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు పోలీసుల దృష్టికి వెళ్లాయి. దీంతో శ్రీకాంత్ స్వామిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Srinivas Mittapalli
    First published: