గెలుపు కోసం నేతల క్షుద్రపూజలు... బురిడీ కొట్టిస్తున్న దొంగ సాధువులు

ప్రత్యర్థులను ఏదో రకంగా ఓడించాలనే ఆలోచనతో ఉండే కొందరు నేతలు... ఇందుకోసం క్షుద్రపూజలను కూడా ఆశ్రయించే ఘటనలు కర్ణాటకలోని కొల్లిగల్ పట్టణంలో జరుగుతున్నాయి.

news18-telugu
Updated: April 5, 2019, 7:44 PM IST
గెలుపు కోసం నేతల క్షుద్రపూజలు... బురిడీ కొట్టిస్తున్న దొంగ సాధువులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నికల్లో గెలిచేందుకు నాయకులు ఎంతగా కష్టపడుతుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యర్థిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలగా కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కూడా నాయకులు సిద్ధపడుతుంటారు. ప్రత్యర్థి ఓటమి ఖాయమనే భరోసా ఇస్తే ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంటారు నేతలు. అయితే ప్రత్యర్థులను ఏదో రకంగా ఓడించాలనే ఆలోచనతో ఉండే కొందరు నేతలు... ఇందుకోసం క్షుద్రపూజలను కూడా ఆశ్రయించే ఘటనలు కర్ణాటకలోని కొల్లిగల్ పట్టణంలో జరుగుతున్నాయి. ఎన్నికల్లో విజయం కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు ఇక్కడికి వచ్చి సాధువుల చేత క్షుద్ర పూజలు చేయించడం కొన్నేళ్లుగా జరుగుతోంది.

కర్ణాటక చామరాజనగర్ జిల్లాలో కొల్లిగల్ ఒక పట్టణం. అయితే ఎన్నికలొస్తే మాత్రం ఇక్కడికి రాజకీయ నేతలు క్యూ కడుతుంటారు. ఇక్కడ పూజలు చేస్తే తమను విజయం వరిస్తుందని వారంతా నమ్ముతుంటారు. ప్రస్తుతం కొల్లిగల్‌లో 30 మంది సాధువులు ఉన్నట్టు సమాచారం. వీరంతా స్మశానాలు, నిర్మానుష ప్రదేశాల్లో అర్థరాత్రి సమయంలో పూజలు చేస్తుంటారు. ప్రత్యర్థుల ఓటమి కోసం శత్రు నివారణ పూజలు చేయిస్తుంటారు. అయితే కొంతమంది సాధువుల వేషాలు వేసుకుని నాయకులను మోసం చేస్తున్నారనే వాదన కూడా ఉంది. ఇక్కడ నిజమైన సాధువులు లేరని...వారంతా ఎప్పుడో కేరళకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా... ప్రజలను మోసం చేసే నాయకులను మోసం చేయడానికి సాధువులు కూడా తమకు తెలిసిన విద్యను నమ్ముకుంటున్నారు.

First published: April 5, 2019, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading