హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: మందుబిళ్లల పేరుతో సుద్దముక్కలు... ప్రజల ప్రాణాలతో చెలగాటం

Andhra Pradesh: మందుబిళ్లల పేరుతో సుద్దముక్కలు... ప్రజల ప్రాణాలతో చెలగాటం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fake Medicines: ఉత్తరాఖండ్ (Uttrakhand) కు చెందిన ఓ కంపీ వీటిని తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్రమార్కులు మల్టీనేషనల్ కంపెనీ స్థాయిలో బ్యాచ్ నెంబర్లు, ప్యాకింగ్ ఇలా అన్నింటిని పక్కాగా చూపించారు.

  ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మాఫియాకు తెరలేచింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరకు కాకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకునేవారి అవసరాలను ఆసరాగా తీసుకొని నకిలీ మందులు సరఫరా చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో నకిలీ మందుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా మందులు విక్రయించడం.. అందులోనూ నకిలీ మందులు రోగులకు అంటగట్టడం కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, చుట్టుపక్కల ప్రాంతాలు, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. ట్యాబ్లెట్ల స్థానంలో సుద్దముక్కలు విక్రయిస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మందులను సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా విక్రయిస్తున్నారా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

  ఇటీవల ఓ డ్రగ్ కంట్రోల్ అధికారి భీమవరంలో అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లను కొనుగులు చేసి వాటిని పరీక్షల నిమిత్తం విజయవాడలోని డ్రగ్ ల్యాబ్ కు పంపారు. వీటిని పరిశీలంచగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చింది. 500 ఎంజీ అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లో కనీసం 10శాతం కూడా మందులేదు. మందు బిళ్లల పేరుతో సుద్దముక్కలు అమ్ముతున్నట్లు అధికారులు నిర్ధారించారు. దాదాపు 8 బ్యాచుల్లో మందులను పరిశీలించగా అన్ని సుద్దముక్కలే ఉన్నాయి. ఉత్తరాఖండ్ కు చెందిన ఓ కంపీ వీటిని తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

  ఇది చదవండి: కృష్ణాజిల్లాలో ఒంటికన్ను రాక్షసి... చూస్తే హడలిపోతారు..


  అక్రమార్కులు మల్టీనేషనల్ కంపెనీ స్థాయిలో బ్యాచ్ నెంబర్లు, ప్యాకింగ్ ఇలా అన్నింటిని పక్కాగా చూపించారు. దీంతో జనం కూడా అవి నిజమైన ముందులనుకొని కొనుగోలు చేస్తున్నారు. దగ్గు తగ్గేందుకు అజిత్రోమైసిన్‌ మాత్రలు వాడతారు. వీటిని వేసుకోవడం వల్ల దగ్గు తగ్గకపోగా మరేదైనా సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

  ఇది చదవండి: మేనకోడల్ని ఆశీర్వదించిన 'జగన్ మామ'.. సీఎం జగన్ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా...?


  అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రాజమండ్రిలోని ఓ హేల్ సైల్ మెడికల్ షాపులో సెల్ జి పేరుతో విక్రయిస్తున్న పెయిన్ కిల్లర్లు నకిలీవిగా అధికారులు తేల్చారు. వీటిని సుద్ధముక్కలతో తయారు చేసి విక్రయిస్తున్నట్లు తేల్చారు. 2వేల పైగా నకిలీ ట్యాబ్లెట్లను సీజ్ చేసిన అధికారులు వాటిని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. ఈ మందులు కూడా ఉత్తరాఖండ్ లోని HPHIN కంపెనీ వీటిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

  ఇది చదవండి: ఏకగ్రీవంగా ఎన్నుకోనందుకు కక్ష... అంతిమయాత్రను అడ్డుకున్న సర్పంచ్ అభ్యర్థి..  గతంలో గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో నకిలీ మందుల విక్రయం జరిగింది. ఇప్పుడు ఈ మాఫియా గోదావరి జిల్లాలకు విస్తరించింది. కేవలం గోదావరి జిల్లాల్లోనే నకిలీ మందులు విక్రయిస్తున్నారా..? లేక ఇతర ప్రాంతాల్లోనూ అమ్ముతున్నారా? అనే దానిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దృష్టి పెట్టారు. సేకరించిన నకిలీ మందులపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Bhimavaram, Drugs, East Godavari Dist, Telugu news, West Godavari

  ఉత్తమ కథలు