Home /News /crime /

FAKE JOB RACKET BUSTED BY HYDERABAD POLICE THAT DUPED OVER 25 GOVT JOB ASPIRANTS AMOUNT ABOVE 1 CR THREE HELD IN FORMAT GOVT EMPLOYEE MKS

Hyderabad : చూడ్డానికి అమాయకంగా ఉన్నారు కదా! చేసింది తెలిస్తే ఛీకొడతారు!! -హీరో సూర్యలాగా

నిందితులు వీరమణి, రాజ్ కుమార్, పాండు

నిందితులు వీరమణి, రాజ్ కుమార్, పాండు

అభ్యర్థులు తెలినంతా ఉపయోగించి సమాధానాలు చెబుతారు.. ఐదు,పది నిమిషాల్లోనే ఇంటర్వ్యూ పూర్తవుతుంది.. కంగ్రాట్స్ నువ్ సెలెక్ట్ అయ్యావ్.. ఫలానా రోజు వచ్చి అపాయింట్మెంట్ తీసుకోమని చెబుతాడు. తీరా జాయినింగ్ లెట్ తీస్కొని ఫలానా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాకగానీ..

ఇంకా చదవండి ...
అది హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రాంతం.. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ప్రధాన కార్యాలయం.. విజిటర్స్ లాంజ్ లో దర్జాగా ఓ వ్యక్తి కూర్చొని ఉంటాడు.. ఆనవాళ్లను బట్టి ఆయనే ఉన్నతాధికారిని అని గుర్తించి అమాయకులు దగ్గరికి వెళతారు.. బహిరంగంగానే ఇంటర్యూ నిర్వహిస్తున్నట్లు ఏవో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు తెలినంతా ఉపయోగించి సమాధానాలు చెబుతారు.. ఐదు,పది నిమిషాల్లోనే ఇంటర్వ్యూ పూర్తవుతుంది.. కంగ్రాట్స్ నువ్ సెలెక్ట్ అయ్యావ్.. ఫలానా రోజు వచ్చి అపాయింట్మెంట్ తీసుకోమని చెబుతాడు. తీరా జాయినింగ్ లెట్ తీస్కొని ఫలానా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాకగానీ తెలీదు.. అసలక్కడ ఏ నియామకమూ కాలేదని.. తాము అడ్డంగా మోసపోయామని!! ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు ఏకంగా 25 మంది వరకు యువతను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన నకిలీ ఉద్యోగాల ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అదేదో సినిమాలో హీరో సూర్యా నకిలీ ఉద్యోగాల పేరుతో ఏకంగా బ్యూరోనే పెట్టినట్లు ఈ గ్యాంగ్ కూడా చిన్నపాటి సెటప్ తో వరుస నేరాలకు పాల్పడుతున్నది. దీనికి సంబంధించి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు చెప్పిన వివరాలివి..

పంచాయితీ రాజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పాతిక మంది యువకుల్ని నిలువునా మోసం చేసి రూ.1.29 కోట్లు కాజేసిన ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి దగ్గర్నుంచి రూ.8.85లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ పంచాయితీ రాజ్ ఉద్యోగి అరండకర్ రాజ్ కుమార్ ఈ ముఠాకు మేస్త్రీ కాగా, వీరమణి అనే మహిళ, పాండు అనే డ్రైవర్ అతనికి సహాయకులుగా వ్యవహరిస్తారు.

shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్ములుగు జిల్లా కేంద్రంలో పంచాయితీ రాజ్ శాఖలో సూపరింటెండెట్ గా పనిచేసిన రాజ్ కుమార్.. వచ్చే జీతంతో సంతృప్తి చెందకుండా అక్రమబాట పట్టాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించే దందాకు శ్రీకారం చుట్టిన ఆయన.. రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన వీరమణి, హైదరాబాద్ శివారు బడంగ్ పేటకు చెందిన పాండును అసిస్టెంట్స్ గా పెట్టుకుని గడిచిన ఏడాది కాలంగా మోసాలకు పాల్పడుతున్నాడు. పంచాయితీ రాజ్ శాఖలో రికార్ట్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు యువకుల్ని మోసం చేశారు. దీనికి సంబంధించి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో ఉన్నతాధికారులు రాజ్ కుమార్ ను సస్పెండ్ చేశారు.

ముసలోడేగానీ ఈ వయసులోనూ.. బీహార్ సీఎంపై విమర్శల వెల్లువ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యేని అంతమాట అనేశాడేం?ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన తర్వాత రాజ్ కుమార్ ఏకంగా కన్సల్టెన్సీనే మొదలుపెట్టారు ఉద్యోగాలొస్తాయనే ఆశతో వాళ్లను నమ్మినవాళ్లను.. ఎర్రమంజిల్ పీఆర్ ఆఫీసుకు తీసుకెళ్లి ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహించి, నకిలీ నియామకపత్రాలు చేతుల్లో పెట్టేవాడు. వాటితో ఆఫీసులకు వెళ్లగా నకిలీవని తేలడంతో ఇటీవల మోసపోయిన ఇద్దరు వ్యక్తులు పంజాగుట్ట, మీర్ పేట్ పోలీస్ స్టేషన్లనో ఫిర్యాదు చేశారు. పక్కా ఆధారాలతో నకిలీ ఉద్యోగాల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Fake jobs, Hyderabad, Hyderabad police

తదుపరి వార్తలు