టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై మరో కేసు

నకిలీ ఐడి కార్డు క్రియేట్ చేశారని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై మరో కేసు నమోదైంది.

news18-telugu
Updated: October 17, 2019, 1:21 PM IST
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై మరో కేసు
రవి ప్రకాశ్ (File)
news18-telugu
Updated: October 17, 2019, 1:21 PM IST
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసినట్టు రవిప్రకాశ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఐటీ యాక్ట్ కింద కేసు సీసీఎస్ పోలీసులు ఈ కేసు పెట్టినట్టు సమాచారం. మరోవైపు చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న రవి ప్రకాశ్‌ను పిటీ వారెంట్‌పై సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఇప్పటికే రవిప్రకాష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు నమోదు కాగా టీవీ9 లో ఫండ్‌ను అనధికారికంగా తరలించారన్న ఆరోపణలపై రవి ప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. దీంతో పాటు గతంలో టీవీ9 ఆఫీసుకు వెళ్లిన పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలు కూడా రవిప్రకాష్‌పై ఉన్నాయి. ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 సీఆర్పీసీ నోటీసులిచ్చారు.


First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...