అదంతా భర్తే చేశాడని తెలిసి భార్య షాక్.. పరువు తీయడానికే అలా..

ప్రొఫైల్ నిండా అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశాడు. ఆమె స్నేహితులకు,బంధువులకు అసభ్యకర సందేశాలు పెట్టాడు.స్నేహితులు,బంధువులు ఆమెకు విషయం చెప్పడంతో.. ఇది ఎవరి పనై ఉంటుందని ఆమె తీవ్రంగా ఆలోచించింది.

news18-telugu
Updated: October 19, 2019, 7:29 AM IST
అదంతా భర్తే చేశాడని తెలిసి భార్య షాక్.. పరువు తీయడానికే అలా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె ఓ వివాహిత.. ఆమెకు తెలియకుండా ఎవరో ఆమె పేరు మీద ఫేస్‌బుక్ ఖాతా క్రియేట్ చేశారు.అంతేకాదు, ఆమె స్నేహితులు, బంధువులకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు పెట్టారు. ఆపై ప్రొఫైల్ నిండా బూతు కంటెంట్‌తో నింపేశారు. ఫ్రెండ్ లిస్టులో ఉన్న స్నేహితులు, బంధువులకు కూడా అసభ్యకర మెసేజ్‌లు పెట్టారు. కొన్నాళ్లకు విషయం ఆమెకు తెలియడంతో.. ఇలా తన పరువు తీయాల్సిన అవసరం ఎవరికి ఉందని తీవ్రంగా ఆలోచించింది.ఎంతకీ అంతుపట్టకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ఆమె భర్తే ఇదంతా చేశాడని తెలియడంతో షాక్ తిన్నది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ శివారులోని మహేశ్వరం మండలానికి చెందిన లింగం(27)కి 2016లో వివాహం జరిగింది. అతని భార్య సాధారణ గృహిణి. పదో తరగతి వరకు చదువుకున్న లింగం చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.కొన్నాళ్లు సాఫీగానే సాగిన వీరి కాపురంలో... ఆ తర్వాత మనస్పర్థలు మొదలయ్యాయి. వేధింపులు ఎక్కువవడంతో లింగంపై అతని భార్య పలుమార్లు కేసు పెట్టింది. దీంతో లింగం ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల ఫేస్‌బుక్ గురించి తెలుసుకుని.. అందులో ఆమె పేరిట,ఆమె ఫోటోతో నకిలీ ఖాతా క్రియేట్ చేశాడు.

ప్రొఫైల్ నిండా అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశాడు. ఆమె స్నేహితులకు,బంధువులకు అసభ్యకర సందేశాలు పెట్టాడు.స్నేహితులు,బంధువులు ఆమెకు విషయం చెప్పడంతో.. ఇది ఎవరి పనై ఉంటుందని ఆమె తీవ్రంగా ఆలోచించింది.ఎంతకీ అంతుపట్టకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. లింగంపై అనుమానం వచ్చిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: October 19, 2019, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading