FAKE DOCTOR ARRESTED FOR TRYING TO SEDUCE WOMAN IN DHARMAPURI DISTRICT TAMILNADU SSR
Medical Shop: మెడికల్ షాపు నడుపుతున్నావ్.. మందులు అమ్ముకోకుండా ఇదేం పని.. ఇప్పుడేమైందో చూడు..
షణ్ముగం (ఫైల్ ఫొటో)
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కరిమంగళం సమీపంలో ఉన్న హనుమంతపురంలో షణ్ముగం అనే యువకుడు మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు. అంతేకాదు.. తన దగ్గరకు మెడిసిన్స్ కోసం వచ్చే వారికి తనకు తెలిసిన వైద్యం చేసి మరీ మందులిచ్చేవాడు.
ధర్మపురి: తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కరిమంగళం సమీపంలో ఉన్న హనుమంతపురంలో షణ్ముగం అనే యువకుడు మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు. అంతేకాదు.. తన దగ్గరకు మెడిసిన్స్ కోసం వచ్చే వారికి తనకు తెలిసిన వైద్యం చేసి మరీ మందులిచ్చేవాడు. ఇతనికి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేదు. కనీసం ఆర్ఎంపీ కూడా కాదు. కానీ.. మెడికల్ షాపులో ఓ గదిని క్లినిక్ మాదిరిగా నడుపుతూ వైద్యం చేస్తుండేవాడు.
ఈ క్రమంలో.. సొన్నంపట్టి ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ అనే వ్యక్తి తన భార్య భారతి(30)తో కలిసి షణ్ముగం దగ్గరకు వచ్చాడు. తన భార్యకు ఆరోగ్యం సరిలేదని, వైద్యం చేసి మందులివ్వాలని కోరాడు. ఆమెను లోపలికి తీసుకెళ్లిన షణ్ముగం సెలైన్ ఎక్కించాలని చెప్పి ఆ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎక్కడెక్కడో తాకుతూ.. నడుము తడుముతూ తప్పుగా ప్రవర్తించడంతో ఉలిక్కిపడిన భారతి కేకలేసింది.
దీంతో.. ఏమైందని ఆమె భర్త మదన్ కుమార్ అడిగాడు. జరిగిందంతా ఆమె పూసగుచ్చినట్లు వివరించింది. కోపంతో ఊగిపోయిన ఆమె భర్త భార్యను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి షణ్ముగంపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే.. షణ్ముగం అసలు వైద్యుడే కాదన్న విషయం బయటపడింది. ఇతను నకిలీ డాక్టర్ అని, మెడికల్ షాపులో క్లినిక్ నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అతనిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఇలాంటి ఫేక్ డాక్టర్లు, నర్సులు ప్రజల ప్రాణాలను రిస్క్‌లో ఉంచి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ముంబైలోని శివాజీ నగర్లో ఓ ఫేక్ నర్స్ కారణంగా రెండేళ్ల బాబు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. శివాజీ నగర్‌కు చెందిన రెండేళ్ల పిల్లాడైన అజీమ్ ఖాన్ వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఉంటే పిల్లాడిని నూర్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు.
ఈ పిల్లాడి బెడ్ పక్కనే మరొక 16 ఏళ్ల బాలుడు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. అజీమ్ ఖాన్‌కు ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ చేసే క్రమంలో నర్స్ నర్గిస్ ఓ ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ చేసిన అరగంటకే అజీమ్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ పక్కన జ్వరంతో బాధపడుతున్న పిల్లాడికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఇతనికి ఇవ్వడంతో ప్రాణం పోయిందని విచారణలో తేలింది. ఇద్దరి ఇంజెక్షన్లు ఒకే డ్రాయర్లో ఉంచడంతో పొరపాటున ఇంజెక్షన్ మారిపోయింది. డోస్ ఎక్కువ కావడంతో పిల్లాడు చనిపోయాడు. అసలు ఆమె నర్సే కాదని, హాస్పిటల్లో స్వీపర్‌గా పనిచేసే మహిళ అని తేలింది. తన కొడుకు హాస్పిటల్లో చేర్చిన రెండు రోజులకే కోలుకున్నాడని, యాంటీబయాటిక్స్ ఇవ్వాలని డిశ్చార్జ్‌ను ఆలస్యం చేశారని పిల్లాడి తండ్రి చెప్పాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు స్థానికంగా ఉన్న క్లినిక్స్‌పై రైడ్స్ చేశారు. ఫేక్ డాక్టర్లపై చర్యలు తీసుకున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.