2వేల నోట్ల కుప్పలు... ఖమ్మంలో భారీగా నకిలీ కరెన్సీ సీజ్

ముఠా సూత్రధారి మదార్ మియాగా పోలీసులు గుర్తించారు. వీరంతా కలిసి తెలంగాణ, ఏపీ, తమిళనాడులో చాలా మంది అమాయక ప్రజలను మోసం చేసినట్టు విచారణలో తేలింది.

news18-telugu
Updated: November 2, 2019, 10:52 PM IST
2వేల నోట్ల కుప్పలు... ఖమ్మంలో భారీగా నకిలీ కరెన్సీ సీజ్
నకిలీ నోట్లు
  • Share this:
ఖమ్మంలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. పెద్ద మొత్తంలో రూ.2వేల నోట్లను ముద్రిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి కేంద్రంగా దొంగ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్‌తో వారిని పట్టుకున్నారు. ఖమ్మం సి.పి తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలతో ఖమ్మం టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ట్రాఫిక్ సీఐ కరుణాకర్, సిబ్భంది కలిసి నకిలీ కరెన్సీ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని నుంచి రూ.7కోట్లు నకిలీ నోట్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 8 మంది కోసం గాలిస్తున్నారు. ముఠా సూత్రధారి మదార్ మియాగా పోలీసులు గుర్తించారు. వీరంతా కలిసి తెలంగాణ, ఏపీ, తమిళనాడులో చాలా మంది అమాయక ప్రజలను మోసం చేసినట్టు విచారణలో తేలింది. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు పోలీసులు.
First published: November 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>