Home /News /crime /

FAKE BABAS WHO TOOK RS 8 LAKH IN THE NAME OF WORSHIP SAYING THAT THERE WAS GOLD IN THE WORSHIP ROOM OF THE HOUSE PRV

Gold in Lord room: పూజ గదిలో బంగారం ఉందని చెప్పి పూజలు చేసిన బాబాలు.. కొన్నిరోజులు తిరిగి సరికి షాక్​.. 

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆ ఇంట్లోకి బాబాలు వచ్చారు. ఇళ్లంతా తిరిగారు. పూజ గదిలో బంగారం ఉందన్నారు. పూజలు చేశారు. పూజ చేసిన కొన్ని రోజులకే వాళ్లందరికీ షాక్​ తగిలే న్యూస్​ ఒకటి తెలిసింది.

    టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా మూఢనమ్మకాలను మాత్రం చాలామంది వీడటం లేదు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు.  డబ్బు, బంగారం మీది ఆశ వారిని మాయలో పడేస్తుంది. ఇదే నకిలీ బాబాలకు (fake baba) ఆయుధంగా మారుతోంది. అలా పూజ గదిలో బంగారం (Gold in Lord room) వెలికి తీస్తామని మోసం చేసిన నకిలీ బాబాలను అరెస్టు చేసిన ఘటన మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్లో చోటు చేసుకుంది.

    కరీంనగర్ (Karimnagar) జిల్లా గన్నేరువరంకి చెందిన మతం చందు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన ఎర్నాళ్ల సంజీవ్ అలియాస్ సంజయ్ బాబాలుగా అవతారమెత్తారు. ఏప్రిల్ 11న ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ మాచర్ల రాజు వద్దకు వచ్చి బాబాలుగా పరిచయం చేసుకున్నారు. మీ ఇంటికి తీసుకు వెళ్లి భోజనం పెడితే అంతా శుభం కలుగుతుందని చెప్పారు. అందుకు అంగీకరించిన ఆయన.. ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టారు. ఇంట్లో పూజగది మూసి ఉండడంతో ఆరా తీశారు.

    ఇంట్లో దెయ్యం ఉందని..

    సోదరుడి కుమారుడు చనిపోవడంతో పూజలు చేయడం లేదని రాజు పేర్కొన్నాడు. దీంతో ఇంట్లో దెయ్యం ఉందని, అమావాస్య రోజు పూజ చేయాలని, లేకపోతే మరో మరణం సంభవిస్తుందని భయపెట్టి.. మూడు వేలు తీసుకుని వెళ్ళిపోయారు. వారం తర్వాత బాబాలను కలిసి పూజ చేయాలని కోరగా అందుకు వారు రూ.35 వేలు తీసుకుని పూజలు చేసి వెళ్ళిపోయారు. పదిరోజుల తర్వాత బాబాలు మళ్ళీ వచ్చి మీ ఇంట్లో పూజ గదిలో రూ.4 కోట్ల విలువైన బంగారం ఉందని నమ్మించారు. వారి మాటలు నమ్మిన అతను బంగారం వెలికితీయాలని కోరాడు. అందుకు సిద్దిపేటలో రూ.1.80 లక్షలు విలువ చేసే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని చెప్పారు. అతడిని పూజాసామాగ్రి షాపుకు తీసుకువెళ్లి రూ. 30,000 సామాగ్రి రాజుకు ఇచ్చి పంపించారు.

    ఆ తరువాత కమిషన్ గా దుకాణదారుడు బాబాలకు 1.5 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత వివిధ పూజల పేరుతో రూ. 7.5 లక్షలు వసూలు చేశారు. పూజలు చేశామని... కొన్ని రోజుల తర్వాత పూజగది తెరిచి చూడాలని చెప్పి వెళ్లిపోయారు. రోజులు గడుస్తున్నా బంగారం కనిపించకపోవటంతో రాజు కుటుంబం మోసపోయామని గ్రహించారు. దీంతో ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఓటి బృందం సాయంతో గాలింపు చేపట్టారు. ఆదివారం నకిలీ బాబాలు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి రూ. 15 వేల నగదు, కారు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cheating, Gold

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు