Home /News /crime /

Nizamabad: బాలికపై దొంగబాబా అత్యాచారం.. గర్భం రావడంతో.. చితకొట్టిన మహిళలు

Nizamabad: బాలికపై దొంగబాబా అత్యాచారం.. గర్భం రావడంతో.. చితకొట్టిన మహిళలు

ప్రతీకాత్మక చిత్రం (credit - twitter)

ప్రతీకాత్మక చిత్రం (credit - twitter)

Nizamabad: బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బాధితులు షాకింగ్‌కు గురయ్యారు.

  తమ మాయమాటలతో మహిళలను లొంగదీసుకుని అత్యాచారాలకు పాల్పడే మోసగాళ్ల ఆడగాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్‌లో ఓ దొంగబాబా చేసిన దారుణాలు మహిళలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఐదేళ్ళ నుంచి భూత వైద్యం మెడిటేషన్ పేరుతో బాబా ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. మెడిటేషన్, క్షుద్ర పూజలు, ఆత్మల ప్రవేశం అంటూ అనారోగ్య సమస్యలు తీరుస్తానని మహిళలను లొంగదీసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తల్లీ, కూతురు ఇటీవల బాబాను ఆశ్రయించారు.

  అమాయకులైన వారికి మాయమాటలు చెప్పిన ఈ మాయగాడు తల్లీకూతుళ్లను లొంగదీసుకున్నాడు. వైద్యం పేరుతో తన దగ్గరకు వచ్చే మహిళలకు మత్తు ఇవ్వడం.. ఆ తరువాత గదిలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారాలకు పాల్పడటం ఈ దొంగబాబాకు అలవాటు. బాధితులకు నిజం తెలిస్తే వారిని బెదిరించడం వంటివి చేస్తుంటాడు. అలా తన దగ్గరకు వచ్చిన ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బాధితులు షాకింగ్‌కు గురయ్యారు.

  దారుణాన్ని తెలుకుని బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించడం బాబా బాగోతం బయటపడింది. దీంతో దొంగ బాబా కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులు కామాంధుడిని చితకబాదారు. చెప్పులు, చీపుర్లతో కిందపడేసి కసితీరా కొట్టారు. మరోవైపు బాబా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం దొంగబాబా పోలీసుల అదుపులో ఉండగా.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజా ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గతంలో తాము కూడా అనేక వేధింపులకు గురయ్యామని బాధితులు వాపోతున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Crime news, Nizamabad, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు