హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fake Baba : బాబా బాగోతం బట్టబయలు..19 ఏళ్లుగా మహిళపై,ఇప్పుడు ఆమె కూతుళ్లపై..వీడి ఖాతాలో ఇంకెందరో!

Fake Baba : బాబా బాగోతం బట్టబయలు..19 ఏళ్లుగా మహిళపై,ఇప్పుడు ఆమె కూతుళ్లపై..వీడి ఖాతాలో ఇంకెందరో!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Baba Harrased Woman : దెయ్యాలు, భూతాల పేరుతో మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ బాబా బాగోతం బట్టబయలైంది. ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లోని భూతాల పేరు చెప్పి 19ఏళ్ల నుంచి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్న బాబా.. ఇప్పుడు ఆమె కూతుళ్లపై కన్నేశాడు.

ఇంకా చదవండి ...

Baba Harrased Woman : దెయ్యాలు, భూతాల పేరుతో మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ బాబా బాగోతం బట్టబయలైంది. ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లోని భూతాల పేరు చెప్పి 19ఏళ్ల నుంచి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్న బాబా.. ఇప్పుడు ఆమె కూతుళ్లపై కన్నేశాడు. తన విషయంలో ఓర్పుగా ఉన్న బాధితురాలు కుతూళ్లపై దొంగ బాబా కన్నేయడంతో సహించలేకపోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది

ఉత్తరాఖండ్(Uttarakhand)​ రాష్ట్రంలోని హరిద్వార్ కు చెందిన ఓ మహిళ అదే రాష్ట్రంలోని కరన్​ పుర్​ లో నివాసం ఉండేది. ఆమె 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురికావడంతో అదే ప్రాంతంలో ఉండే పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా(Baba) వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను ఆత్మల పేరుతో భయపెట్టి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించాడు. 2003 నుంచి ప్రవీణ్ ఆ మహిళ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. అదే సమయంలో కూల్​ డ్రింక్​లో మత్తు మందులు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, 2006లో సదరు దొంగ బాబా ఆ ప్రాంతం వదిలి డెహ్రాడూన్‌ కు వెళ్లిపోయాడు. అయితే, ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. అయితే 2012లో ఆమెకు ఓ మానసిక రోగితో వివాహం జరిపించాడు. ప్రస్తుతం ఆ మహిళకు 8 ఏళ్లు మరియు 4 ఏళ్లు వయస్సు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే బాబా కన్ను ఇప్పుడు మహిళ కూతుళ్లపై పడింది. కుతూళ్లపై దొంగ బాబా కన్నేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. దీవెనెల పేరుతో ప్రవీణ్‌ గుజ్రాల్‌ తనను అనుచితంగా తాకేవాడని తెలిపింది. బాబా ఇచ్చే ఔషధాల వల్ల తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని వాపోయింది.

ALSO READ Shocking: వీడిని ఏం చేసినా పాపం లేదు..సొంత చెల్లెళ్లపై అత్యాచారం..అడ్డొచ్చిన కన్న తల్లిని కూడా..

2021 మే నెలలో తన కూతుళ్లతో బాబా కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తన వద్ద నుంచి బాబా రూ.40 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాబాతో పాటు అతడి భార్యపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే మహిళ ఆరోపణలను ప్రవీణ్ కొట్టిపారేశాడు. తనను బ్లాక్​ మెయిల్ చేసేందుకే మహిళ ఇలా ఆరోపణలు చేస్తోందని అన్నాడు. గతంలోనూ బాబాపై మహిళ ఇలాగే ఆరోపణలు చేసినట్లు సమాచారం. తన ఇల్లు లాగేసుకున్నారని మహిళ ఆరోపించగా.. విచారణ చేపట్టిన అధికారులు బాబాకు క్లీన్​ చిట్ ఇచ్చారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Rape case, Uttarakhand, Women harrasment

ఉత్తమ కథలు