Telangana: భక్తి పేరుతో మహిళలను లోబరుచుకున్న బాబా.. అతడి రాసలీలలు ఎలా వెలుగులోకి వచ్చాయంటే..

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

భక్తి ముసుగులో అక్రమాలకు పాల్పడుతూ, భక్తులను మోసం చేస్తున్న దొంగ బాబా విశ్వ చైతన్య స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    భక్తి ముసుగులో అక్రమాలకు పాల్పడుతూ, భక్తులను మోసం చేస్తున్న దొంగ బాబా విశ్వ చైతన్య స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. విశ్వచైతన్యది ఏపీ కృష్ణాజిల్లా నందిగామ. అతడు నాలుగేళ్ల క్రితం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో 10 ఎకరాల స్థలం కొన్నాడు. అందులో శ్రీసాయి సర్వస్వం మాన్సీ ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేశాడు. ఈ ట్రస్ట్ పేరిట అతడు మోసాలకు పాల్పడుతున్నాడు. భక్తి పేరుతో అతడు మహిళలను లోబర్చుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తన వద్దకు వచ్చేవారి నుంచి భారీగా డబ్బులు వసూలే చేయడమే కాకుండా.. మూలికలు, తాయెత్తులు ఇస్తూ మోసం చేసేవాడు. తనకు ఎంత సొమ్ము.. అంతకు నాలుగు రెట్లు వారికి వస్తుందని జనాలను నమ్మించి బురిడీ కొట్టించేవాడు.

    ఇలా కొందరు మహిళ భక్తులను లోబరుచుకుని వారితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన విశ్వ చైతన్య భార్య అతడికి విడాకులు ఇచ్చింది. దీంతో అతడు సుజీత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక, విశ్వచైతన్యపై ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసలు విచారణ చేపట్టారు. భక్తి ముసుగులో నేరాలకు పాల్పడుతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు శిష్యులను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.26లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలు, రూ.1.5 కోట్ల ఎఫ్‌డీలు, 17 ఎకరాల భూమి తాలూకు పత్రాలు, 7 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సుజీత పేరిట రూ.1.3 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లు తేలింది.

    ఇక, విశ్వచైతన్యకు పలు దేశాల్లో భక్తులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. భక్తి పేరుతో తనవద్దకు వచ్చేవారి నుంచి విశ్వచైతన్య కోట్లు సంపాదించాడు. వివిధ సమస్యలతో తన వద్దకొచ్చే మహిళలను మాయమాటలతో లోబర్చుకొని వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. ఇక, విశ్వచైతన్య మొబైల్‌లో అన్నీ మహిళల నగ్న వీడియోలు, వాట్సాప్‌లో అసభ్యకరమైన చాటింగ్‌లను పోలీసులు గుర్తించారు.
    Published by:Sumanth Kanukula
    First published: