మీ ఇంట్లో బంగారు నాణేలు... నకిలీ బాబా మాయమాటలు... చివరకు...

కొద్దిరోజుల క్రితం ఊరిలోకి వచ్చిన ఓ నకిలీ బాబా మీ ఇంట్లో బంగారు నాణెలకు సంబంధించి గుప్త నిధి ఉందంటూ ఆ కటుంబాన్ని నమ్మించాడు. ఇందుకోసం పూజలు చేయాలంటూ వారి దగ్గర రూ. 10 లక్షలు వసూలు చేశాడు.

news18-telugu
Updated: April 17, 2019, 1:30 PM IST
మీ ఇంట్లో బంగారు నాణేలు... నకిలీ బాబా మాయమాటలు... చివరకు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మూఢనమ్మకాలను నమ్మేవాళ్లు ఉంటే... వారి నమ్మించి మోసం చేసే మాయగాళ్లకు కొదవే ఉండదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని హుజూర్ నగర్ మండలం అమరవరంలో గుప్తనిధుల కోసం ఓ ఇంట్లో తవ్వకాలు జరిపారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు... అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా... ఓ నకిలీ బాబా నిర్వాకం వెలుగులోకి వచ్చింది.

కొద్దిరోజుల క్రితం ఊరిలోకి వచ్చిన ఓ నకిలీ బాబా మీ ఇంట్లో బంగారు నాణెలకు సంబంధించి గుప్త నిధి ఉందంటూ ఆ కటుంబాన్ని నమ్మించాడు. ఇందుకోసం పూజలు చేయాలని... అందుకు రూ. 10 లక్షలు ఖర్చువుతుందని నమ్మబలికాడు. వాళ్లు కూడా అతడి మాటలు నమ్మి రూ. 10 లక్షలు ఇచ్చారు. పూజలు అనంతరం జరిపిన తవ్వకాల్లో 20 కేజీల వరకు బంగారు నాణెలు కూడా బయటపడటంతో... గుప్తనిధులు నిజమే అని వారంతా నమ్మారు. అయితే పోలీసులు మాత్రం ఆ నాణెలన్నీ నకిలీవే అని...పలు రసాయిన పరీక్షల అనంతరం తేల్చారు. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు.
First published: April 17, 2019, 1:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading