• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • FACTION WAR BETWEEN YCP LEADERS IN KADAPA DISTRICT 7 INJURED PRNN

Andhra Pradesh: సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల కొట్లాట.., చిచ్చుపెట్టిన వాట్సాప్ మెసేజ్

Andhra Pradesh: సీఎం జగన్ సొంత  జిల్లాలో వైసీపీ నేతల కొట్లాట.., చిచ్చుపెట్టిన వాట్సాప్ మెసేజ్

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) సొంత ఇలాకా కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ విభేదాలు భగ్గుమన్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రేగిన వివాదంతో వైసీపీలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ విభేదాలు భగ్గుమన్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రేగిన వివాదంతో వైసీపీలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా వీరపునాయుని పల్లెం మండలం పాయసంపల్లెలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులపై వైసీపీ నేతలు సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వర్గాల మధ్య వివాదం రేగింది. దీంతో ఇరు వర్గాలు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో సుధాకర్ రెడ్డి గన్ తీసుకొచ్చి గాలిలోకి కాల్పులు జరిపారు. ఘటనలో ఏడుగురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    ఏం జరిగిందంటే...!
    వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సుధాకర్ రెడ్డి లోకల్ వాట్సాప్ గ్రూప్ లో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. దీనిపై స్పందించిన మహేశ్వర్ రెడ్డి మన కొత్త సంవత్సరం ఉగాదిగా అని ప్రశ్నించారు. దీంతో వాట్సాప్ గ్రూప్ లోనే మాటల యుద్ధం రేగింది. ఈ క్రమంలో మాట్లాడుకుందాం రమ్మని ఇరు వర్గాలు సవాల్ చేసుకున్నాయి. గ్రామంలో ఎదురుపడ్డ ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఘటనలో పలువురి తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డారు.

    ఎంపీటీసీ టికెట్ కోసమేనా..?
    ఎంపీటీసీ టికెట్ కోసమే మహేశ్వర్ రెడ్డి తనపై దాడి చేసినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు చెప్పారు. ఘటనలో తన మేనల్లుడు చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. మండలంలో స్థానిక ఎన్నికల సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే తనకు అప్పజెప్పారని.. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు తాను నిరాకరించానని అందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. విధిలేని పరిస్థితుల్లోనే లైసెన్స్డ్ గన్ తో కాల్పులు జరిపినట్లు చెప్పారు. తన ఇంటిపైకి 30మంది కత్తులు, కర్రలతో దాడికి యత్నిస్తే ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్త మాత్రమేనని.. అతనితో పోటీ పడాల్సిన అవసరం లేదని చెప్పారు.

    మరోవైపు ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో పాయసంపల్లెలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘటనాస్థలిలో తుపాకీతో పాటు వేటకొడవళ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఘర్షణలో పాల్గొన్న పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుధాకర్ రెడ్డి – మహేశ్వర్ రెడ్డి మధ్య పాతకక్షలున్నాయని.. ఈ నేపథ్యంలోనే ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published: