హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fact Check: సిటీల్లో బైక్ జర్నీకి హెల్మెట్ పెట్టుకోనవసరం లేదా? వాట్సప్ లో మీకూ ఈ మెసేజ్ వచ్చిందా..? అసలు కథేంటంటే..

Fact Check: సిటీల్లో బైక్ జర్నీకి హెల్మెట్ పెట్టుకోనవసరం లేదా? వాట్సప్ లో మీకూ ఈ మెసేజ్ వచ్చిందా..? అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సిటీల్లో బైకులపై ప్రయాణించే వాళ్లకు గుడ్ న్యూస్ అంటూ వాట్సప్ లో ఓ మెసేజ్ వచ్చిందా.? హెల్మెట్ పెట్టుకోనవసరం లేదంటూ కోర్టు తీర్పొచ్చిందంటూ ఆ మెసేజ్ లో ఉందా? అయితే దాన్ని అస్సలు నమ్మకండి..

‘బ్రేకింగ్ న్యూస్. సిటీల్లో నివసించే పౌరులకు పండగ లాంటి వార్త. నగర పరిధి లో బైకులపై హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చు. దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీలను కోర్టు తిరస్కరించింది. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదనీ, రక్షణ అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తుందని కోర్టు తేల్చిచెప్పింది. అయితే స్టేట్ హైవే, జిల్లా హైవేలపై మాత్రం హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని తీర్పునిచ్చింది. కేవలం నగర పరిధుల్లో మాత్రమే హెల్మెట్ ధరించడం అనేది పౌరుల వ్యక్తిగత ఇష్టం అని వెల్లడించింది. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని, అడిగితే, నేను మునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పొచ్చు. మీపై జరిమానా కూడా వేయలేరు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి’ అంటూ వాట్సప్ లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

అన్ని వాట్సప్ గ్రూపుల్లోనూ తెగ షేర్ అవుతోంది. అయితే ఈ వార్తను నమ్మి ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే, ఇది ఒట్టి ఫేక్ న్యూస్ కావడమే అసలు కారణం. పైన చెప్పిన మెసేజ్ తోపాటు ఆ మెసేజ్ కిందే, దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్, ఉమ్మడి న్యాయవాది సమాఖ్య‘ అని పేర్కొంటూ రెండు ఫోన్ నెంబర్లను కూడా ఆ మెసేజ్ లో జోడించారు. మొదటి నెంబర్ పనిచేయకపోగా, రెండో నెంబర్ మాత్రం కలిసింది. అయితే ఆ నెంబర్ దేవేంద్ర ప్రతాప్ సింగ్ దే కావడం గమనార్హం. విషయం చెప్పి, నిజమేనా అని అడిగితే మొదట ఆయన ఆశ్చర్యపోయారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

‘ఇది వట్టి పుకారు మాత్రమే. అసలు నాకు, ఆ మెసేజ్ కు ఏమాత్రం సంబంధం లేదు. వెల్లువలా వస్తున్న కాల్స్ ను తట్టుకోలేక మొదటి నెంబర్ ను స్విచాఫ్ చేశాను. నా పేరు మీద ఎవరో పుకార్లు సృష్టిస్తున్నారు. వీటిని ఎవరూ నమ్మొద్దు. ఫార్వార్డ్ చేయొద్దు. కోర్టులు ఇలాంటి తీర్పులను ఇవ్వవు.‘ అంటూ ఆ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లాయర్. ఆయన పేరు మీద ఇలాంటి ఫేక్ న్యూస్ లు ప్రచారం కావడంతో అంతా విస్తుపోతున్నారు. ప్రజలు ఎవరూ ఇలాంటి మెసేజ్ లను నమ్మొద్దనీ, వాటిని ఫార్వార్డ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు ప్రచారం మొదలు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏడాది క్రితం పెళ్లయిన కూతురిని ఇంటికి పిలిచి.. అందరం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని చెప్పిన తండ్రి.. చివరకు..

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Fact Check, Hyderabad, Telangana, Vijayawada

ఉత్తమ కథలు