భర్తను చంపిన భార్య... పక్కా ప్లాన్... ప్రియుడి సాయం... పోలీసులు ఎలా కనిపెట్టారంటే...

భర్తను చంపిన భార్య... పక్కా ప్లాన్... ప్రియుడి సాయం... (credit - youtube)

Extramarital Affair: వివాహేతర సంబంధాలతో జాగ్రత్తగా ఉండాలని ఎన్నో క్రైమ్ కథలు చెబుతున్నాయి. తాజాగా మరో తంతు అలాగే కొనసాగింది. భార్య చేతిలోనే భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

 • Share this:
  Extramarital Affair: అది కర్ణాటకలోని మాండ్య. అక్కడి హనకెరెలోని ఓ ఇంట్లో 12 ఏళ్ల కొడుకును పక్కన పెట్టుకొని... భర్త ప్రదీప్ (35) శవం ముందు బోరున ఏడ్వసాగింది 30 ఏళ్ల శిల్ప. చుట్టుపక్కల వాళ్లు, బంధువులూ... అందరూ వచ్చారు. ఏమైందని అడిగితే... తెల్లవారు జామున గుండెపోటుతో చనిపోయాడని లబోదిబో మంది. కరోనా వల్ల టెన్షన్లు ఎక్కువై హార్ట్ ఎటాక్ వచ్చిందని కన్నీళ్లు పెట్టింది. పక్కనున్న కొడుకు కూడా నాన్నా అంటూ ఏడుస్తుంటే... అందరి హృదయాలూ కరిగిపోయాయి. నవంబర్ 19న ఇది జరిగింది. ఇక ఆ తర్వాత... అందరూ కలిసి అమెను ఓదార్చడం, అంత్యక్రియలు చెయ్యడం... అన్నీ జరిగాయి. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కొడుకును చూసుకునేందుకు ఆమె... ఏదైనా ఉద్యోగం వెతుక్కుంటానని అందరికీ చెప్పింది. ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇచ్చి... ధైర్యం చెప్పి వెళ్లిపోయారు.

  ప్రియుడితో జల్సాలు:
  ప్రదీప్ కుటుంబ సభ్యులకు శిల్ప చెప్పిందొకటి... వాస్తవంలో జరుగుతున్నది మరొకటి. ఆమె మధునాయక్ (34) అనే వ్యక్తితో సరదాగా తిరుగుతూ ఉండటాన్ని చూశారు. ఆ ఇకఇకలు, పకపకలూ చూసి... భర్త చచ్చి పది రోజులు కూడా కాలేదు... అప్పుడే మరో వ్యక్తితో ఎలా తిరుగుతోందో... ఏదో జరుగుతోంది... అనుకున్నారు. ఆ తర్వాత... శిల్ప కొడుకును అడిగితే... ఆ మధు నాయక్ అనే వ్యక్తి... అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ ఉంటాడని చెప్పాడు. దాంతో... వాళ్ల అనుమానం మరింత పెరిగింది. జరిగిన ఘటనపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మాండ్య రూరల్ పోలీసులు... కేసు రాసి... దర్యాప్తు మొదలుపెట్టి... అసలు మేటర్ మొత్తం రాబట్టారు.

  ఇది కూడా చదవండి:యువకుడితో మైనర్ లవ్ ఎఫైర్... ఇంట్లో తెలియకూడదని గ్యాంగ్ రేప్ డ్రామా... ఆ తర్వాత

  ఇదీ మేటర్:
  పోలీసుల ప్రకారం ప్రదీప్‌, శిల్ప... 13 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 10 ఏళ్లు హ్యాపీగా ఉన్నారు. మూడేళ్ల కిందట మధు నాయక్, శిల్పకు పరిచయమయ్యాడు. ఇతను కేఆర్‌ నగరంలో ఉండేవాడు. ఒకరకమైన దళారి. స్వయం సేవా సంఘాల వారికి రుణాలను ఇప్పించి, కమిషన్ రాబట్టేవాడు. అలా శిల్పకు పరిచయమై ఏకంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. శిల్ప భర్త ఇంట్లో లేని టైమ్‌లో రుణాల పేరుతో ఆ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇద్దరూ వేరే నగరాల్లో కలిసి తిరిగేవాళ్లు కూడా. ఈ విషయం తెలిసి ప్రదీప్‌... చాలాసార్లు భార్యతో గొడవపడ్డాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాట వినేది కాదు.

  మర్డర్ ప్లాన్:
  రాన్రానూ ప్రదీప్‌తో గొడవలు ఎక్కువవుతుంటే... ఏకంగా భర్తనే లేపేయాలనుకుంది మహాతల్లి. ఇందుకు మధునాయక్ సరే అన్నాడు. ఓ మందుల షాపు నుంచి నిద్రమాత్రలు తెచ్చి ఆమెకు ఇచ్చాడు. నవంబర్‌ 18 రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. ఇవాళ కూరేంటి చేదుగా ఉంది అంటే... కొద్దిగా మాడింది... ఏం కాదులెండి... గ్యాస్ బండ కొత్తది తెచ్చారుగా... మంట ఎక్కువొచ్చింది... అని నాటకాలాడింది. అలా భోజనం చేసి... ఇలా నిద్రపోయాడు. అర్థరాత్రి ప్రియుడు ఇంటికొచ్చాడు. ఇద్దరూ కలిసి... ప్రదీప్ గొంతు నొక్కి నొక్కి చంపారు. తర్వాత ప్రియుడు వెళ్లిపోయాడు. తెల్లారి... గ్లిజరిన్ డ్రామా మొదలుపెట్టింది. ఒకటే ఏడుపు. మేటర్ మొత్తం తెలుసుకున్న పోలీసులు... ఆమెను, మధు నాయక్‌నూ అరెస్టు చేశారు. జిల్లా జైలుకు తరలించారు. అటు తండ్రిని కోల్పోయి... ఇటు తల్లి దూరమై... ఆ 12 ఏళ్ల పిల్లాడు ఒంటరయ్యాడు. వివాహేతర సంబంధాలు గులాబీ కింద ముళ్లు లాంటివి... కచ్చితంగా గుచ్చుతాయి.
  Published by:Krishna Kumar N
  First published: