హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: ప్రియుడితో కలిసి భర్తనే చంపిన భార్య.., చివరికి ఎలా దొరికిపోయిందంటే..!

Andhra Pradesh: ప్రియుడితో కలిసి భర్తనే చంపిన భార్య.., చివరికి ఎలా దొరికిపోయిందంటే..!

రంజిత్ కుమార్ తన స్నేహితుడు సెల్వకుమార్‌తో కలిసి సెల్వరాయర్‌ను అంతమొందించాడు. సెల్వరాయర్ హత్య కేసుకు సంబంధించి రంజిత్ కుమార్ పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. తన తాత సెల్వరాయర్ వడ్డీలకు డబ్బులిచ్చేవాడని, ఆ వడ్డీని వసూలు చేసి తాతకు ఇచ్చేవాడినని.. అలా ఇచ్చినందుకు తనకు ఖర్చులకు డబ్బులిచ్చేవాడని రంజిత్ చెప్పాడు.

రంజిత్ కుమార్ తన స్నేహితుడు సెల్వకుమార్‌తో కలిసి సెల్వరాయర్‌ను అంతమొందించాడు. సెల్వరాయర్ హత్య కేసుకు సంబంధించి రంజిత్ కుమార్ పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. తన తాత సెల్వరాయర్ వడ్డీలకు డబ్బులిచ్చేవాడని, ఆ వడ్డీని వసూలు చేసి తాతకు ఇచ్చేవాడినని.. అలా ఇచ్చినందుకు తనకు ఖర్చులకు డబ్బులిచ్చేవాడని రంజిత్ చెప్పాడు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రకాశం జిల్లా (Prakasham District) సంతమాగలూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను.. భార్యే హత్య చేసింది.

సమాజంలో వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. తాత్కాలిక సుఖాలు, ఆకర్షణలకు లోనవుతున్న కొందరు విచక్షణ మరచి జీవిత భాగస్వాములనే మట్టుబెడుతున్నారు. కొన్నిచోట్ల భర్తల చేతిలో భార్యలు బలవుతుంటే.. మరికొన్ని చోట్ల భార్యలే.. భర్తలను మట్టుబెడుతున్నారు. ఈ దారుణాలన్నింటికీ ఒకటే కారణం వివాహేతర సంబంధం. ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భార్యే..,భర్తను కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండల కేంద్రానికి చెందిన దంపతులు చెన్నుపల్లి శ్రీనివాసరావు, సైదాలక్ష్మీ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యభర్తలు వేరువేరు చోట్ల కూలిపనులు చేస్తున్నారు. ఈక్రమంలో ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా నరసరావుపైట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నల్లగంగుల వెంకటరెడ్డి అనే ఆటో డ్రైవర్ తో సైదా లక్ష్మికి పరిచయం ఏర్పడింది.

పరిచయం కాస్తా హద్దులుదాటి వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసిన శ్రీనివాసరావు.. పద్ధతి మార్చుకోమని సైదా లక్ష్మిని హెచ్చరించాడు. కానీ ఆమె తన ప్రవర్తనను మార్చుకోకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త ఉంటే తమ ఆనందానికి అడ్డొస్తాడన్న కోపంతో అతడ్ని ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేసింది. తన స్కెచ్ ను ప్రియుడు వెంకటరెడ్డితో చెప్పి ఒప్పించింది. ఈ క్రమంలో ఈనెల 25న రాత్రి శ్రీనివాసరావు ఫుల్లుగా తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. తర్వాత మద్యం మత్తులో నిద్రపోయాడు. ఇదే అదునుగా తీసుకున్న సైదా లక్ష్మి ప్రియుడ్ని పిలిపించింది. ఆమె భర్త కాళ్లు పట్టుకోగా.. వెంకటరెడ్డి పీకనొక్కి శ్రీనివాసరావును హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుప్రచారం చేసింది.

ఐతే మృతుడి తమ్ముడు వీరయ్య అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్ట్ మార్టం ఆధారంగా శ్రీనివాసరావుది హత్యగా తేల్చారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు నేరాన్నిఅంగీకరించింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.

First published:

Tags: Andhra Pradesh, Crime, Extramarital affairs, Murder, Prakasham dist, Wife kill husband