kolkata lady in Vizag: ప్రేమించడం.. ప్రేమ (Love) కోసం ఏదైనా చేసేవాళ్లు చాలామందే ఉంటారు. పెళ్లికి ముందు ప్రేమలో పడడం.. వారి చేతిలో మోసపోవడం చాలా రోజుల నుంచి వింటున్నాం.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు పెళ్లైన మహిళలు కూడా ప్రియుడి మోజులో పడి (extramarital affairs).. పిల్లలను (Childrens), భర్త (Husband)ను వదిలేసి వెళిపోతున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రియుడి చేతిలో మోసపోయిన కోల్‌కతాకు (Kolkata) చెందిన ఓ వివాహిత (Married WOmen) విశాఖపట్నం (Visakhapatnam)లోని ఎంవీపీ పోలీసుల సంరక్షణలో ఉంది. అయితే పోలీసులు అడిగిన పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో.. ఆమెను కేజీహెచ్ (KGH)లోని ‘సఖి వన్‌స్టాప్ (Sakhi one stop)సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఏమన్నారంటే.. కోల్‌కతాకు చెందిన వివాహిత నీలిమా ఖతూన్ ఎంవీపీకాలనీ డబుల్ రోడ్డులో ఏడుస్తూ అనుమానాస్పద స్థితిలో ఉండటాన్ని అక్కడి స్థానికులు గమనించారు. ఓదార్చినా ఆమె వినలేదు. దీంతో స్థానిక రాజకీయ నేత కల్యాణ్‌కు వారు సమాచారం ఇచ్చారు. ఆయన.. ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఏ వివరాలు చెప్పలేకపోవడంతో ఎంవీపీ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు.
విశాఖకు ఎలా వచ్చింది.. కుటుంబం ఎక్కడ ఉంది..
ఆమె వివరాలు చెబితే భర్త దగ్గరకు పంపిస్తామని.. హ్యాపీగా కాపురం చేసుకోవచ్చని పోలీసులు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ మహిళ మాత్రం తన కుటుంబ వివారాలు చెప్పడం లేదు. అయితే తనకు పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. కోల్ కతా నగరం అని మాత్రమే చెప్పింది. గతంలో భర్త, తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేశాను అని చెప్పింది. తనకు ఇక భర్త దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదని చెబుతోంది.
ఆ ప్రియుడు ఎవరు..?
తాను ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్న సమయంలో.. పరశురాం అనే వ్యక్తితో పరిచయం అయిందని.. ఆయన తనను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. నన్ను కోల్‌కతా తీసుకెళ్లిపోయారన్నాది ఆమె. ఆ తరువాత కూడా పరశురాంతో ఫోన్లో మాట్లాడేదాన్నిఅన్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలు.. మంచి జీవితం.. కానీ ప్రియుడి కోసం వెళ్లిపోయింది.. తిరిగి వచ్చింది కానీ..
విశాఖపట్నం ఎలా వచ్చింది.. ఈ క్రమంలో పరశురాం వారం రోజుల కిందట విశాఖ వచ్చి.. తనను కూడా తీసుకొచ్చాడని చెప్పింది. పిల్లలను చూడాలని అతనికి చెప్పగా.. అతనితో గొడవ జరిగింది. రెండు రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పరశురాం ఎంవీపీ డబుల్ రోడ్డులో తనను వదిలేసి వెళ్లిపోయాడు అని పోలీసులకు చెప్పింది.
ఇదీ చదవండి: పగటిపూట నిద్ర మంచిదా...? అలా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా..?
తన తల్లిదండ్రుల చిరునామా ఏంటి..? పరశురాం ఏం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు.. అనే వివరాలను ఆమె వెల్లడించలేకపోతోంది. దీంతో ఎంవీపీ పోలీసులు దర్యాప్తు నిమిత్తం కేజీహెచ్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. ఆమె చిరునామా తెలిసిన తరువాత భర్త, తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. వారి నుంచి పూర్తి వివరాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపడతామని ఎంవీపీ సీఐ రమణయ్య వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Extra marital affair, Visakhapatnam, Vizag