Extramarital Affair: ప్రియుడితో డేటింగ్ చేస్తున్న భార్య.. వారి రాసలీలలు తెలుసుకున్న భర్త.. తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మకచిత్రం

వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఓ మహిళ వివాహేతర సంబంధం ఆమె భర్తను జైలు పాలు చేసింది.

  • Share this:
    వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఓ మహిళ వివాహేతర సంబంధం ఆమె భర్తను జైలు పాలు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. భార్య మరొకరితో ఎఫైర్(Extramarital Affair) సాగిస్తున్న విషయం తెలుసుకున్న భర్త కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. వివరాలు.. శేఖర్ అనే వ్యక్తికి అర్చన అనే మహిళతో వివాహం జరిగింది. అయితే శేఖర్‌తో పెళ్లి జరిగినప్పటికీ.. భోపాల్‌కు(Bhopal) చెందిన అరవింద్ అహిర్వార్ (Arvind Ahirwar) అనే వ్యక్తితో అర్చన వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. అతనితో కలిసి డేటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అర్చన, అరవింద్ తరచూ కలిసేవారు. ఇటీవల ఇద్దరు కలిసి ఇండోర్‌కు వెళ్లారు. ఈ విషయం కాస్తా తెలుసుకున్న శేఖర్.. అరవింద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.

    ఈ క్రమంలోనే అరవింద్‌ను హత్య చేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు. అర్చనకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడేందుకు అరవింద్‌ను శేఖర్ ఇంటికి ఆహ్వానించాడు. దీంతో మంగళవారం అరవింద్.. శేఖర్ (Shekhar) ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత శేఖర్.. అతనితో పర్సనల్‌గా మాట్లాడటం కోసమని చెప్పి.. ఇంట్లోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే తెచ్చిపెట్టిన పెట్రోల్‌ను అరవింద్‌పై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

    చీరకట్టుతో వెళ్తే అవమానిస్తారా..? ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన మహిళ.. రెస్టారెంట్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

    అయితే అరవింద్ అరుపులు విన్న స్థానికులు కొందరు.. అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. కొందరు ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అరవింద్‌ను ఝాన్సీ మెడికల్ కాలేజ్‌కు (Jhansi Medical College) తరలించారు. అరవింద్‌కు 50 శాతం కాలిన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది.

    Married Woman: 5 నెలల క్రితం పెళ్లి.. ఆమె జీవితం హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు.. కానీ ఇంతలోనే..

    మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అరవింద్ కుటుంబ సభ్యలు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు శేఖర్, అతని భార్యపై కేసు నమోదు చేశారు. శేఖర్, అర్చన‌లపై (Archana) పోలీసులు ఐపీసీ 307, 326 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ిన సర్కిల్ ఆఫీసర్ రాజేష్ కుమార్ సింగ్ ధ్రువీకరించారు.
    Published by:Sumanth Kanukula
    First published: