HOME »NEWS »CRIME »extramarital affair man attacks uncle over having extra marital affair with aunt in ranchi nk

మేనత్తతో వివాహేతర సంబంధం... అనుకోకుండా ఓ రోజు తలుపు తీసి చూస్తే...

మేనత్తతో వివాహేతర సంబంధం... అనుకోకుండా ఓ రోజు తలుపు తీసి చూస్తే...
మేనత్తతో వివాహేతర సంబంధం... అనుకోకుండా ఓ రోజు (ప్రతీకాత్మక చిత్రం)

Extra marital affair: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక విద్యార్థులు చెడిపోతున్నారా... మంచి కంటే చెడే ఎక్కువగా నేర్చుకుంటున్నారా... సమాజంలో ఏం జరుగుతోంది?

 • Share this:
  Extra marital affair: కరోనా కాలంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వాటిలో మరొకటి చేరింది. ఈ వివాహేతర సంబంధం పుట్టింది జార్ఖండ్ రాజధాని రాంచీలో. అక్కడి ఓ ఇంట్లో రాధేశ్యామ్, అతని భార్య హాయిగా జీవించేవారు. ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవలూ లేవు. మనస్పర్థలూ లేవు. అలాంటి ఇంట్లోకి కొన్ని నెలల కిందట మేనల్లుడు ఎంటరయ్యాడు. తన ఊళ్లో ఇంటర్నెట్ సదుపాయం లేదనీ... అదే రాంచీలో అయితే అది ఉంది అని వాళ్ల ఇంటికి వచ్చాడు. చదువుకునే కుర్రాడు. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ క్లాసులు చదవాల్సి ఉంది. అందుకు ఇంటర్నెట్ సదుపాయం కావాలి. సరేలే... పూటకి ఇంత తింటూ... చదువుకుంటాడులే అని ఆ దంపతులు ఆ కుర్రాణ్ని తమతో ఉండనిచ్చారు.

  ఎప్పుడైతే ఆ కుర్రాడు ఇంట్లోకి ప్రవేశించాడో... ఆ దంపతుల మధ్య దూరం పెరిగింది. ముఖ్యంగా రాత్రిళ్లు వేరువేరుగా నిద్రపోతున్నారు. ఆ కుర్రాడిని దృష్టిలో పెట్టుకొని వారు అలా చేస్తున్నారు. ఇవేవీ ఆ కుర్రాడు గమనించలేదు. తన దారిన తాను చదువు కుంటూ, వేళకు తింటూ హాయిగా ఉంటున్నాడు.  అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. రాధేశ్యామ్ రోజూ ఉదయం పనికి వెళ్లి సాయంత్రం చీకటిపడే వేళకు ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో ఒంటరిగా ఉండే ఆమె... క్రమంగా ఆ కుర్రాడి పట్ల ఆకర్షితురాలైంది. మెల్లమెల్లగా అతనికి చేరువవుతుంటే... మొదట్లో ఆ కుర్రాడు ఆమెను దూరం పెట్టాడు. కానీ ఆమె వదల్లేదు. ఏం పర్లేదు అంటూ అతన్ని కవ్వించింది. అలా వాళ్ల మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియని రాధేశ్యామ్... రోజూ ఇంటికి వచ్చి... "బాగా చదువుకుంటున్నావా... ఇంటర్నెట్ కనెక్షన్ బాగా వస్తోందా... ఏం ఇబ్బంది లేదుగా" అని అడుగుతుంటే... ఆ పిల్లాడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. లోలోపల తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ అతన్ని వెంటాడింది.

  ఓ రోజు రాధేశ్యామ్ పనికి వెళ్లినప్పుడు... అక్కడ ఎవరికో కరోనా రావడంతో... ఆ రోజుకు పని లేదని చెప్పారు. దాంతో రాధేశ్యామ్ తిరిగి ఇంటికి వెళ్లాడు. ఇంటి డోర్ తెరిచే ఉంది. లోపలికి వెళ్లి... గోడకు వాచీని తగిలిస్తుంటే... బెడ్ రూమ్ నుంచి ఎవేవో శబ్దాలు వస్తున్నాయి. ఏదైనా పిల్లి దూరిందేమో అనుకొని అటుగా వెళ్లాడు. బెడ్‌రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంది. దాన్ని తట్టేలోపే అతనికి విషయం అర్థమైంది. షాక్ అయ్యాడు. పిచ్చి కోపం వచ్చింది. దబాదబా బాదాడు.

  ఇది కూడా చదవండి:Vastu Shastra: వాల్‌క్లాక్‌ను అక్కడ ఉంచితే అదృష్టం… అలా ఉంచితే దురదృష్టం

  లోపల బిజీగా ఉన్న ఇద్దరికీ గుండెల్లో రైళ్లు, విమానాలు, ఇంకా ఏవేవో పరిగెత్తాయి. ఏం చెయ్యాలో అర్థం కాని ఇద్దరూ రాధేశ్యామ్‌ని చంపేయాలని డిసైడయ్యారు. ఇద్దరూ నగ్నంగానే డోర్ తీసి... అతన్ని చంపేసేందుకు పీక నొక్కగా... బలవంతంగా తప్పించుకున్న రాధేశ్యామ్... ఇంట్లోంచీ బయటకు పారిపోయాడు. ఆ పక్కన చుట్ట కాల్చుకుంటున్న స్థానికులు... రెట్టించి అడగడంతో అసలు విషయం చెప్పాడు. వామ్మో... అంటూ వాళ్లు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు రాధేశ్యామ్ భార్యను, ఆ కుర్రాణ్నీ అరెస్టు చేశారు.
  Published by:Krishna Kumar N
  First published:January 17, 2021, 13:14 IST