ప్రియుడితో ఆ పనిలో బిజీగా భార్య... రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

ప్రియుడితో ఆ పనిలో బిజీగా భార్య... రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Extramarital Affair: కొన్నాళ్లుగా అతనికి భార్యపై అనుమానం ఉంది. విషయం తేల్చాలనుకున్నాడు. తేల్చేశాడు. ఇప్పుడు బంతి పోలీసుల కోర్టులో ఉంది.

 • Share this:
  Extramarital Affair in Hyderabad: అది హైదరాబాద్... రామాంతపూర్. అక్కడి ఓ బస్తీ. కరోనా అన్‌లాక్ 5.0 తర్వాత... ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కొంత మంది మాస్కులతో తిరుగుతుంటే... మరికొందరు అవసరం లేదనుకుంటూ... తిరుగుతున్నారు. అలాంటి చోట జరిగిందీ ఘటన. ఓ వ్యక్తి పోలీసుల దగ్గరకు వచ్చి... తన గోడు చెప్పుకున్నాడు. మొదట అతను చెప్పేది పోలీసులు నమ్మలేదు. "నువ్వు నిజంగానే ఆమెను టార్చర్ పెడుతున్నావేమో" అన్నారు. "నేను కాదు సార్... తనే నన్ను టార్చర్ పెడుతోంది. దాని సంగతి మీకు తెలియదు... నాతో రండి చూపిస్తా" అన్నాడు. అతను చెప్పేది ఎందుకో పోలీసులకు నమ్మాలనిపించింది. సరే పద అంటూ అతనితో వెళ్లారు. ఓ ఇంటికి పోలీసుల్ని తీసుకెళ్లిన అతను... మూసి వున్న డోర్ కొట్టాడు. లోపల... అతని భార్య... మరో వ్యక్తితో సరససల్లాపాల్లో ఉంది. డోర్ కొట్టగానే వాళ్లిద్దరూ షాక్ అయ్యారు. మళ్లీ గట్టిగా డోర్ కొట్టాడు. ఈసారి లోపల తీవ్ర కలకలం రేగింది. పోలీసులు... అతన్ని మరోసారి డోర్ కొట్టకుండా ఆపారు. కొన్ని క్షణాలకు లోపలి వ్యక్తి డోర్ తీశాడు. పోలీసులు లోపలికి వెళ్లారు. అక్కడ ఆమె కనిపించింది. "చూశారా సార్... నేను చెప్పినట్లే జరిగింది. తను నా భార్య. నాపై గృహ హింస కేసు పెట్టింది. నన్ను పోలీస్ కేసులో ఇరికించింది. ఇక్కడ వాడితో ఎంజాయ్ చేస్తోంది. మీరే నాకు న్యాయం చెయ్యాలి" అన్నాడు.

  ఆమె భయంతో బిత్తర చూపులు చూసింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి నీళ్లు నములుతూ... భయపడుతూ ఉన్నాడు. "ఏమ్మా... ఇతను నీ భర్తేనా" అని అడిగారు పోలీసులు. అవునంది. "ఇతనిపై నువ్వు గృహ హింస కేసు పెట్టావా" అని అడిగారు. "అవునండి పెట్టాను. నన్ను టార్చర్ పెడుతున్నాడు కాబట్టే పెట్టాను" అంది ఆమె. పోలీసులకు వెంటనే ఆమె చెప్పింది నమ్మబుద్ధి కాలేదు. పూర్తిగా ఎంక్వైరీ చేస్తే తప్ప... నిజానిజాలు తేలవు అనుకున్నారు.

  "మీకు తెలీదు సార్... వీడు నా భార్యను చాలా మార్చేశాడు. వీడి కోసం తను ఎంతకైనా తెగిస్తోంది. నా భార్య సిటీలోని ఆ ప్రభుత్వ ఆస్పత్రిలో... ఆ ఉద్యోగం చేస్తోంది. వీడు నా భార్యతో స్నేహం మొదలుపెట్టాడు. అంతే... ఇంట్లో రోజు గొడవలు మొదలయ్యాయి. నాకు డౌట్ వచ్చింది. ఎందుకు తను అలా చేస్తోందో అని ఓ కన్నేశాను. అప్పుడు అర్థమైంది.... ఈ యవ్వారం నడుస్తోందని. దీనిపై ఓ రోజు నిలదీశాను. ఇలా చెయ్యడం మంచిది కాదని మందలించాను. అంతే... తర్వాతి రోజే... నాపై ఐపీసీ సెక్షన్ 498(A) కింద గృహ హింస కేసు పెట్టింది. వీళ్లిద్దరి వల్లా నేను ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. దయచేసి మీరే నాకు న్యాయం చెయ్యాలి. అందుకే మీకు వీళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాను" అన్నాడు బాధితుడు.

  కేసు రాసిన పోలీసులు... బాధితుడి భార్య, మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకొని... పోలీస్ ‌స్టేషన్‌కి తరలించారు. రెండుపైపులా ఇంటరాగేషన్ చేసి... తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జనరల్‌గా ఇలాంటి కేసుల్లో పోలీసులు మొదట కౌన్సెలింగ్ చేస్తారు. అప్పటికీ తీరు మార్చుకోకపోతే... చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు.
  Published by:Krishna Kumar N
  First published: