Home /News /crime /

EXTRAMARITAL AFFAIR ENDING IN A TRAGEDY A WOMAN FROM RAMOL WAS KILLED BY HER LOVER SSR

Tragedy: ఈ ఇద్దరూ ఇప్పుడు మన మధ్య లేరు.. భర్తపిల్లలతో టెర్రాస్‌పై పడుకున్న భార్య.. భర్తకు మధ్యలో మెలకువ వచ్చి చూసేసరికి..

వన్‌రాజ్, భూమిక

వన్‌రాజ్, భూమిక

రమోల్‌కు చెందిన భూమిక పెంచల్ తన భర్త అక్షయ్‌తో కలిసి నివాసముంటోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. పిల్లలను ఉన్నంతలో బాగా చూసుకుంటూ సుఖంగా ఉన్న వీరి జీవితాల్లోకి వన్‌రాజ్‌సిన్హ్ సింధా అనే యువకుడు అనుకోని అతిథిలా వచ్చాడు. తను పనిచేసే దగ్గర అక్షయ్‌కు వన్‌రాజ్ పరిచయమయ్యాడు.

ఇంకా చదవండి ...
    అహ్మదాబాద్: క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కన్నబిడ్డల జీవితాలను అగమ్యగోచరంలోకి నెట్టేస్తున్నారు. భార్యాభర్తలు పిల్లాపాపలతో సుఖంగా ఉండాల్సింది పోయి పర స్త్రీ, పర పురుష వ్యామోహంలో పడి పచ్చని కాపురాల్లో తమంతట తామే చిచ్చు పెట్టుకుంటున్నారు. తాజాగా.. అహ్మదాబాద్ జిల్లా రమోల్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా వివాహిత, ఆమె ప్రియుడు ఇద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ వివాహిత ముగ్గురు పిల్లలు తల్లిని కోల్పోయి విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... రమోల్‌కు చెందిన భూమిక పెంచల్ తన భర్త అక్షయ్‌తో కలిసి నివాసముంటోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. పిల్లలను ఉన్నంతలో బాగా చూసుకుంటూ సుఖంగా ఉన్న వీరి జీవితాల్లోకి వన్‌రాజ్‌సిన్హ్ సింధా అనే యువకుడు అనుకోని అతిథిలా వచ్చాడు. తను పనిచేసే దగ్గర అక్షయ్‌కు వన్‌రాజ్ పరిచయమయ్యాడు. మంచివాడిలా మెలగడంతో అక్షయ్‌తో స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే వన్‌రాజ్‌ను అక్షయ్ అప్పుడప్పుడూ ఇంటికి తీసుకెళ్లి కుటుంబంతో కలిసి భోజనం చేసేంత చనువిచ్చాడు. కానీ.. వన్‌రాజ్ ఆలోచన అక్షయ్ ఇంటికి వెళ్లి అతని భార్యను చూడగానే పెడదోవ పట్టింది. స్నేహితుడి భార్య అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఆమెతో పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించాడు. అక్షయ్ ఇంట్లో లేని సమయంలో కూడా పలుమార్లు భూమికను కలిసి ఆమెకు దగ్గరయ్యాడు. అక్షయ్ భార్య భూమికతో వన్‌రాజ్ చనువు కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్షయ్ ఇంట్లో లేనప్పుడే కాదు ఇంట్లో ఉన్నప్పుడూ కూడా అతని కళ్లుగప్పి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేంత వరకూ పరిస్థితి వెళ్లింది.

    దాదాపు నెల క్రితం.. ఒకరోజు అక్షయ్, తన ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి టెర్రాస్‌పై పడుకున్నాడు. మధ్యలో మెలకువ వచ్చి చూడగా తన భార్య కనిపించలేదు. అనుమానమొచ్చి కిందకు వెళ్లి గదిలో చూడగా.. వన్‌రాజ్, తన భార్య శృంగారం చేస్తూ నగ్నంగా కనిపించారు. ఆ దృశ్యం చూసి అక్షయ్ ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. ఆ షాక్ నుంచి తేరుకుని వన్‌రాజ్‌కు, భూమికకు దేహ శుద్ధి చేశాడు. ఆ మరుసటి రోజు ఉదయమే పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టాడు. తాను మళ్లీ ఈ తప్పు చేయనని భూమిక బతిమలాడటంతో పెద్ద మనుషులు ఇద్దరికీ రాజీ కుదిర్చారు. మళ్లీ తన భార్యను కలిసినట్టు తెలిస్తే మర్యాదగా ఉండదని వన్‌రాజ్‌కు అక్షయ్ వార్నింగ్ ఇచ్చాడు.

    ఇది కూడా చదవండి: Seventh Fail: ఏడో తరగతి ఫెయిల్.. బ్యాంకు ఖాతాలో రూ.60 లక్షలు.. మనోడి స్టోరీ తెలిస్తే రెండు చేతులు జేబులో పెట్టుకుని..

    కొన్ని రోజులు భూమిక, వన్‌రాజ్ కలుసుకోలేదు. కానీ.. గత మంగళవారం అక్షయ్ ఇంట్లో లేని సమయం చూసి వన్‌రాజ్ అతని ఇంటికెళ్లాడు. ఇంట్లో ఉన్న భూమికతో మాట్లాడేందుకు వెళ్లాడు. తాను మళ్లీ ఈ తప్పు చేయనని.. వెళ్లిపోవాలని అతనికి చెప్పినా వన్‌రాజ్ వినిపించుకోలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే క్షణికావేశంలో భూమికను కత్తితో వన్‌రాజ్ పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ భూమిక చనిపోయింది. ఆ తర్వాత.. వన్‌రాజ్ కూడా గొంతు కోసుకుని చనిపోయాడు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Extra marital affair, Husband, Wife

    తదుపరి వార్తలు