EXTRAMARITAL AFFAIR EFFECT WIFE TAKE BOY FRIND HELP FOR KILLING HER HUSBAND IN VIZIANAGARAM DISTRICT NGS VZM
Extramarital Affair: ఆమె చేసిందే పాడు పని.. అందులోనూ అతి తెలివి.. చివరకు ఊహించిన షాక్
భార్యను పట్టించిన అతి తెలివి
Extramarital Affair: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. భార్య భర్త బంధానికి విలువ లేకుండా పోతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే షాక్ అవుతారు.. అతి ప్రేమ చూపించిన భార్య అంతపని చేసిందని ఎవరూ నమ్మలేకపోయారు.
xtramarital Affair: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కోరికలకు కళ్లెం వేసుకోలేకపోవడంతో అనర్థాలు పెరుగుతున్నాయి. మూడు ముళ్ల బంధాన్ని కొందరు ఎగాతాళి చేస్తున్నారు. పతియే ప్రత్యక్ష దైవం అనే రోజుల నుంచి.. ప్రియుడి మోజులు.. భర్తను హత్య చేయడానికి కూడా కొందరు వెనుకాడడం లేదు. తాజాగా విజయనగం జిల్లా (Vizianagaram District)లో జరిగిన ఘటన పోలీసులకే షాక్ ఇచ్చింది. సెల్ప్ యాక్సిడెంట్ అనుకున్న ఓ కేసు.. హత్య (Murder)గా మారింది. అది కూడా భర్తపై చాలా ప్రేమ నటించి.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన భార్యే హత్య చేయించిందని తేలింది.. భర్తపై అంత ప్రేమ నటించిన ఆమె హత్య ఎందుకు చేయించిందని ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
మృతుడు 51 ఏళ్ల డోల రామకృష్ణ (Dola Ramakrishna) కు, సుమారు 27 సంవత్సరాల క్రితం డోల లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు రామకృష్ణ ఆటో నడుపుకొంటూ, వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని నడిపేవాడు. వచ్చిన సంపాదనలో తాగుడుకు ఖర్చు చేయడం, డబ్బులు లేనప్పుడు భార్యను వేధించడం చేసేవాడు. దీంతో కుటుంబ పోషణ కోసం డోల లక్ష్మి దగ్గరలోని పైడి భీమవరంలో గల అరబిందో ఫార్మా కంపెనీ 11 సంవత్సరాల క్రితం హెల్పర్ గా జాయిన్ అయింది. ఈ క్రమంలో ..సుమారు ఎనిమిదేళ్ల క్రితం అదే కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేస్తున్న బొక్కా దశకంఠేశ్వరరావు (ఏ1) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త.. వివాహేతర సంబంధంగా మారింది. డోల లక్ష్మి అవసరాలకు నిందితుడు డబ్బులు సర్దుతుండేవాడు. అదే విధంగా నిందితుడు దశకంఠేశ్వరరావు (ఏ1) అప్పుడప్పుడు తన ప్రియురాలు లక్ష్మి ఇంటికి రావడం, భర్త రామకృష్ణ తో కూడా సన్నిహితంగా మెలిగేవాడు.
రామకృష్ణ తాగుడు కోసం.. దశకంఠేశ్వరావు నుండి డబ్బులు తీసుకొనేవాడు. సుమారు ఏడాది క్రితం (ఏ1) దశకంఠేశ్వరరావుకి, తన భార్య లక్ష్మికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా గుర్తించాడు. కొన్నిసార్లు ఇద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అప్పటి నుండి భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అయితే తమ అక్రమ సంబంధానికి భర్త రామకృష్ణ అడ్డుగా ఉన్నాడని భావించి .. దశకంఠేశ్వరరావు, భార్య డోల లక్ష్మి.. రామకృష్ణను అడ్డు తొలగించుకోవాలని, చంపేయాలని నిర్ణయించుకొన్నారు.
దశకంఠేశ్వరరావు స్నేహితుడు గుదే శంకరరావు(ఏ2) సహాయాన్ని కోరారు. అందుకు అంగీకరించిన (ఏ2) శంకర్రావు .. వారి నుండి 5 వేల రూపాయలు అడ్వాన్సుగా కూడా తీసుకున్నాడు. తర్వాత రామకృష్ణకు, గుదే శంకరరావును తన స్నేహితుడిగా దశకంఠేశ్వరరావు పరిచయం చేసాడు. వారు వేసుకున్న పథకం ప్రకారం .. ఈ నెల 2న నిందితులైన దశకంఠేశ్వరరావు, గుదే శంకర్రాపులు ఇద్దరు కలసి మోటారు సైకిలుపై పేరాపురం వెళ్లి, అక్కడ రైస్ మిల్లు వద్ద మోటారు సైకిలును పార్కింగు చేసి, రామకృష్ణను కలిసి తాగుదామని చెప్పారు.
ఉద్దేశ్యపూర్వకంగా రామకృష్ణతో మద్యం గురించి గొడవపడి, ఆటో నుండి బయటకు తోసేశారు. దగ్గరలో ఉన్న రాయితో తలపై బలంగా మోదారు. దీంతో రామకృష్ణ తలకు తీవ్రమైన గాయమై, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్లాన్ ప్రకారం హైవే మీద నాతవలస వైపు రాత్రి 10 గంటల సమయంలో ఆటోలో వస్తుండగా అక్కడ హైవే పోలీసుల పెట్రోలింగు వాహనాన్ని చూసి, కొద్ది సేపు అక్కడ పొదల వద్దనే ఆగిపోయారు. తరువాత ఆటోను బ్రిడ్జి మీద నుండి చంపావతి నదిలోకి త్రోసేందుకు ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో కొందరు బైక్ లపై వెళ్తూ ఆటోను కిందకు తోయడాన్ని గమనించారు. దీంతో ఆటోను రోడ్డుపైనే తిరగవేసి, రామకృష్ణ శవాన్ని అక్కడే పడేసారు. అక్కడ నుండి పరారై పేరాపురం చేరుకొని, తమ బైక్ ను తీసుకొని, ఇళ్లకు వెళ్లిపోయినట్టు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు.
భార్య లక్ష్మి ద్వారా హత్యకు వేసిన ప్లాన్ ను తెలుసుకున్న పోలీసులు.. డోల రామకృష్ణను హత్య చేసిన నిందితులు (ఏ1) దశకంఠేశ్వరరావు, (ఏ2) గుదే శంకర్రావు లను పూసపాటిరేగ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిజాలను అంగీకరించిన భార్య లక్ష్మిని కూడా అరెస్టు చేసి, ముగ్గురిని రిమాండుకు తరలించారు. దర్యాప్తులో పలువురిని విచారించడం, కాల్ రికార్డులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో మృతుని భార్య డోల లక్ష్మికి దశకంఠేశ్వరరావుతో.. వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి, అక్కడి నుండి అసలు నిజాలను విచారణలో రాబట్టగలిగారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.