Extramarital Affair: మామతో కోడలి వ్యవహారం.. తట్టుకోలేకపోయిన భర్త.. చివరికి ఏం జరిగిదంటే..?

మామతో కోడలి అక్రమ సంబంధం

Extramarital Affair: కొడుకు కి బాధ్యతగా పెళ్లి చేసిన ఓ తండ్రి.. తరువాత కోరికలను కంట్రోల్ చేసుకోలేకయాడు.. కోడలిపై మనసు పడ్డాడు.. మామ చేష్టలను చూసి మురిసిన కోడలు.. భర్త కంటే మామే బెటర్ అనుకుంది.. చివరికి విషయం తెలిసిన కొడుకు తండ్రిని నిలదీయడంతో ఏం జరిగిందో తెలుసా..?

 • Share this:
  ఓ ఇంట్లో తండ్రి, కొడుకు, కోడలు ఉంటున్నారు.. కొన్నాళ్లు కోడలు-కొడుకు కాపురం సక్రమంగానే సాగింది. కానీ ఒంటరి వాడైన మామ తన కోరికలను అదుపులో ఉంచుకోలేకపోయాడు. సొంత కోడలిపై కన్నేశాడు.. అతడి కోరికలను పసిగట్టిన కోడలు.. మరింత కవ్వించే ప్రయత్నం చేసింది. పని మీద బయటకు భర్త వెళ్లే సమయంలో.. ఇద్దరూ ఏకంతంగా ఉండడంతో ఇక ఆలస్యం చేయడం ఎందుకని మనులో భావాలను పంచుకున్నారు. నేరుగా కోడలికే తన మనసులో మాట చెప్పాడు మామ.. ఆమె కూడా భర్త కంటే మామే బెటర్ అనుకుంది. దీంతో తన భర్త బయటకు వెళ్లినప్పుడు కోడలి-మామ మధ్య వ్యవహారానికి అడ్డే లేకుండా ఉండేది. ఇద్దరు హద్దులు మరిచి మరీ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. ఇద్దరి ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ భర్తకు అనుమానం వచ్చింది. అతడు ఊహించిందే నిజమని తెలిసిన తరువాత.. ఛీ ఇదేం పని అని నిలదీశాడు.. తండ్రిలా కోడలిని చూసుకోవాల్సిన సమయంలో ఈ నీచపు పనులు ఏంటి అని ఇద్దర్నీ నిలదీశాడు. ఇక విషయం భర్తకు తెలియడంతో భార్య జీర్ణించుకోలేకపోయింది. అటు తన సుఖానికి కొడుకు అడ్డు పడుతున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయి.. వావివరుసలు మరిచిన వారిద్దరూ చివరికి ఏం చేశారో తెలుసా..?

  ఓ తండ్రి తన సొంత కుమారుడు కోరుకున్న ఆమెతో వివాహం జరిపించాడు. కొడుకు-కోడలికి పెద్ద దిక్కుగా ఉంటి.. ఇంటి బాధ్యత చూసుకోవాల్సిన ఆ తండ్రి.. కామంతో రగిలిపోయాడు. కోడలి అందాలకు మోజు పడ్డారు. దీంతో కన్న కొడుకు భార్యపై కన్నేశాడు. ఆమె కూడా అందుకు అడ్డు చెప్పకపోవడంతో ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే కోడలితో లైంగిక జీవితానికి అడ్డుగా ఉన్నాడని భావించి కుమారుడినే దారుణంగా హత్య చేసిన సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. చేసిదంతా చేసి మళ్లీ ఏమీ ఎరగనట్లు తన కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  బిహార్‌ రాజధాని పాట్నా సమీపంలోని కొద్రాకు చెందిన మిథిలేశ్‌ రవిదాస్‌ కుమారుడు సచిన్ కు కొన్నేళ్ల కిందట వివాహమైంది. భర్త, మామతో కలిసి ఆమె జీవిస్తోంది. ఈ క్రమంలో మామ ఆమెపై కన్నేశాడు. మెల్లగా ఆమెకు దగ్గరై వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అలా మామ, కోడలు కొన్నాళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులకు కుమారుడికి తన ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఒకసారి తన భార్యకు చేరువగా ఉండడాన్ని గమనించి తండ్రిని నిలదీశాడు. తన భార్యతో తండ్రి సాగిస్తున్న సంబంధం తెలుసుకుని షాక్ తిన్నాడు. దీనిపై ముగ్గురు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోడలితో సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి కొడుకు హత్యకు ప్రణాళిక రచించాడు.

  కొడుకు సచిన్‌తో జూలై 7వ తేదీన గొడవపడిన తండ్రి మిథిలేశ్‌ రవిదాస్‌ కొద్దిసేపటికి కత్తితో గొంతుకోసి అతి దారుణంగా హతమార్చాడు. తరువాత మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి సంఘటనను తప్పుదోవ పట్టించాడు. కొంతమందిపై అనుమానం ఉందని ఓ ఐదుగురి పేర్లు కూడా చెప్పారు. వారిని విచారణ చేస్తుండగానే తండ్రి చేసిన ఘాతుకం బహిర్గతమైంది. నిందితుడు మిథిలేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రాజీవ్‌ సింగ్‌ తెలిపారు.
  Published by:Nagesh Paina
  First published: