Home /News /crime /

EXTRA MARTIAL AFFAIR MAN KILLS HIS LOVERS HUSBAND IN MAHARASHTRAS THANE DISTRICT AND BOTH ARE ARRESTED SRD

భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.. కానీ, ఆమె పరాయి వ్యక్తితో పడకగదిలో పాడుపని.. భర్త చూడటంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అతను భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి భర్తను ఆమె మోసం చేసింది. భర్తకు తెలీకుండా మరో వ్యక్తితో..

  వివాహేతర సంబంధాలు, సహజీవనం ఈ రోజుల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటివల్ల ఎన్నో కుంటుబాలు రోడ్డన పడ్డాయి. ఎంతో మంది ప్రాణాలను కూడా వదిలారు. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడితే, సహజీవనం వంటి సంబంధాలు వారి జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ భార్య యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. వివరాల్లోకెళితే.. అతను భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి భర్తను ఆమె మోసం చేసింది. భర్తకు తెలీకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో.. ఆగ్రహంతో ఊగిపోయాడు. చివరకు.. భార్య ప్రియుడి చేతిలో హతమయ్యాడు. పూర్తి వివారాల్లోకెళితే.. ముంబైకి చెందిన రమేశ్ అనే వ్యక్తి పవర్ లూమ్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో జాబ్ పోవడంతో క్యాబ్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు, అతని భార్య లక్ష్మి ముంబై లో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఢిల్లీబాబు దోబీ దుకాణం నడుపుతున్నాడు. ఈక్రమంలో రమేశ్ కి, లక్ష్మీకి వివాహేతరసంబంధం ఏర్పడింది.

  మంగళవారం రాత్రి 10 గంటలకు ఢిల్లీబాబు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా రమేష్, లక్ష్మి గదిలో చనువుగా ఉన్నారు. ఆగ్రహించిన ఢిల్లీ బాబు ఇదేంటని ప్రశ్నించిగా.. రమేష్ అక్కడ ఉన్న కత్తితో అతన్ని చంపాడు. ఆ తర్వాత వేరే వ్యక్తుల సాయంతో బాడీనీ ట్యాక్సీలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్మీకి, రమేశ్ కి గత కొన్నేళ్లుగా వివాహేతరం సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎప్పుట్నుంచో ఢిల్లీ బాబును అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. మొత్తానికి, ఓ అక్రమ సంబంధం అభం శుభం తెలియని ఇద్దరు పిల్లల్ని అనాథల్ని చేసింది.

  ఇలాంటి మరోక ఘటన నోయిడాలో జరిగింది. నోయిడాలో ముఖేష్ (22) ఓ యువతిని ప్రేమించి కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాడు. తన స్వగ్రామాన్ని వదిలి పట్టణానికి వచ్చి ఆమెను పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి జరగకపోయినా ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవితం గడుపుతున్నారు. వీళ్ల మధ్యలోకి అంకుష్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. వారి కాపురంలో చిచ్చు పెట్టాడు.తన ఇంటి పక్కనే ఉన్న అతడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా ఆమె ముఖేష్ కు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని నడిపించింది. కానీ ఓ రోజు ముఖష్ కు తెలిసి.. ఆమెను మందలించాడు. పెళ్లి చేసుకోకపోయినా నీకు ఏం తక్కువ చేశాను అంటూ వాపోయాడు. ఇంట్లో పిల్లలు ఉన్న సంగతి మరిచి ఇలాంటి పాడు పనికి పాల్పడతావా.. అంటూ ఆమెను తీవ్రంగానే మందలించాడు. మనస్థాపానికి గురైన సదరు మహిళ జరిగిన విషయాన్ని అంకుష్ తో చెప్పంది. అంతే కాదు అతడి ఒళ్లో కూర్చోని మరీ కన్నీటి పర్యంతం అయింది.

  ఇది కూడా చదవండి :  భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్న యువతి జీవితంలోకి కీచకుడిలా మేనమామ ఎంట్రీ.. ఆ తర్వాత ఊహించని షాక్..

  దీంతో తీవ్ర కోపోద్రిక్తుడు అయిన అంకుష్ అతడిని కొట్టడానికి బయలు దేరాడు. కానీ ఆమె టైం చూసి చెప్తాను అంటూ అతడిని ఆపేసింది. వీరిద్దరి మధ్య ముఖేష్ అడ్డువస్తున్నాడని.. ఎలాగైన అతడిని అడ్డు తొలగించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ముఖేష్‌పై లేని ప్రేమను నటించి అతడికి ఆమె మద్యం తాగించింది. ఫుల్ గా తాగి మత్తులో అతడు చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ విషయాన్ని అంకుష్ కి ఫోన్ చెప్పి.. వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. అంకుష్ ఆమె ఇంటికి రాగానే ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న ముఖేష్‌ను హతమార్చారు. మరుసటి రోజు ఇక ఆమె అరుపులతో డ్రామా మొదలు పెట్టింది. ఆ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని ఏమైంది అమ్మా.. అంటూ ఆమెను ఆరా తీశారు. దీనితో ఆ యువతి మొసలి కన్నీ​రు కార్చుతూ రాత్రి మద్యం తాగి మత్తులో నిద్రపోయిన ముఖేష్‌ ఉదయాన్నే ఇలా చనిపోయి కనిపించాడని నాటకమాడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

  వారికి కూడా ఇలానే సమాధానం చెప్పింది. కానీ వారు పోలీసులు కదా.. ఆమె కట్టుకథని నమ్మలేదు. ఆమె ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. అక్కడ నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించారు. దెబ్బకు జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. ముఖేష్‌ను తన ప్రియుడు అంకుష్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు అంకుష్ కోసం వెతికి పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Crime news, Extra marital affair, Illegal affair, Maharashtra

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు