భార్య... భర్త... మధ్యలో ఆమె... ట్రయాంగిల్ స్టోరీలో రివెంజ్... పారిపోయిన భార్యాభర్తలు

భార్య... భర్త... మధ్యలో ఆమె... ట్రయాంగిల్ స్టోరీలో రివెంజ్... పారిపోయిన భార్యాభర్తలు (ప్రతీకాత్మక చిత్రం)

సంసార జీవితాలు ఎప్పుడూ సాఫీగా ఉండవు. భార్య భర్త మధ్య మూడో వ్యక్తి వస్తే ఇక ఆ కాపురంలో కలతలు తప్పవు. ఈ కేసేంటో ఎలాంటి మలుపులు తిరిగిందో తెలుసుకుందాం. ఇందులో చివర్లో ట్విస్ట్ తప్పక చూద్దాం.

 • Share this:
  ఆమె పేరు చుమనా యాస్మిన్. అసోంలోని... దుబ్రికి చెందిన మహిళ. 14 ఏళ్ల కిందట డాక్టర్ రూబుల్ ఆహ్మద్‌ని పెళ్లి చేసుకుంది. అతని స్థానిక బంగైగావ్ సివిల్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే... పెళ్లైన కొన్నాళ్ల వరకూ అంతా బాగానే ఉంది. ఆ తర్వాత భర్తలో మార్పు వచ్చింది... ఆమెను సరిగా పట్టించుకోవట్లేదు. రోజూ ఇంటికి రావడం కూడా తగ్గించాడు. అదేమంటే... ఆస్పత్రిలో పేషెంట్ల సంఖ్య పెరిగిందనీ... వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్లే ఇంటికి రాలేకపోతున్నానని చెప్పేవాడు. నిజమే అనుకునేది. తన భర్త ప్రజా సేవలో తరిస్తున్నాడని అనుకుంది. ఇలా ఏళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య మరింత మార్పు వచ్చింది. అసలు ఆమెతో మాట్లాడటమే మానేశాడు. ఏదైనా మాట్లాడినా కసురుకోవడం, చిరాకుపడటం ఇలాంటివి జరుగుతుంటే... ఎందుకిలా అనుకుంది. కరోనా కదా... వర్క్ టెన్షన్ పెరిగిందేమో ఆ కోపం తనపై చూపిస్తున్నాడు అనుకుంది.

  ఈ మధ్య చుట్టుపక్కల ఎవరో... ఆస్పత్రికి వెళ్లి... అక్కడ రూబుల్ అహ్మద్ ఎవరో వేరే అమ్మాయితో పకపకా నవ్వుతూ సరదాగా మాట్లాడటాన్ని చూశారు. ఆ విషయాన్ని చుమనా యాస్మిన్ చెవిన పడేశారు. దాంతో యాస్మిన్‌కి అనుమానం మొదలైంది. ఓ రోజు తనపై చిరాకు పడగానే... నేను బోర్ కొట్టేశానా... ఆ అమ్మాయి ఎవరు అని ప్రశ్నించింది. రూబుల్ అహ్మద్... తనకేమీ తెలియదనీ, ఎలాంటి వివాహేతర సంబంధాలూ లేవని చెప్పాడు. కానీ ఆమె నమ్మలేదు.

  రోజూ ఈ విషయమై ఇంట్లో గొడవలు కామనయ్యాయి. ఓ రోజు చిరాకులో ఉండి... ఆవేశంలో కత్తి తీశాడు. బోరున ఏడ్చింది. ఆ తర్వాత ఆమె విపరీతంగా భయపడింది. ఏదో ఒక రోజు తనను చంపేస్తాడని బలంగా డిసైడైంది. జనవరిలో రాత్రివేళ ఇంట్లోంచీ పారిపోయింది. అలా పారిపోతూ... కొంత దూరం వెళ్లాక... నీపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తా, నన్ను చంపాలని చూశావని చెబుతా అని కాల్ చేసి చెప్పింది. దాంతో రూబుల్ అహ్మద్ చాలా భయపడ్డాడు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు తనను అరెస్టు చేస్తారని భయపడ్డాడు. తను కూడా ఇంట్లోంచీ పారిపోయాడు.

  తాజాగా ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు... ఇప్పుడు రూబుల్ అహ్మద్ కోసం గాలిస్తున్నారు. అతని మొబైల్ స్విచ్ఛాఫ్ అయిపోవడంతో... ఎక్కడున్నదీ తెలియట్లేదు. అతనికి నిజంగానే వివాహేతర సంబంధం ఉందా... ఉంటే ఆ రెండో మహిళ దగ్గరకు వెళ్లాడా అనే డౌట్ ఉంది. కానీ దేనికీ ఆధారాలు లేవు.

  ఇది కూడా చదవండి: Viral video: టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్తున్నారా.. ఈ వైరల్ వీడియో చూశాక.. నిర్ణయం తీసుకోండి

  జనవరి నుంచి ఇప్పటివరకూ రూబుల్‌ అహ్మద్‌తో తిరిగి కలిసుండటానికి తాను ప్రయత్నించాననీ కానీ సాధ్యపడట్లేదని ఆమె చెబుతోంది. ప్రస్తుతం అతను సివిల్ ఆస్పత్రి నుంచి... స్టేట్ హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్ అయినట్లు చెబుతోంది. స్టేట్ హాస్పిటల్ దగ్గర హనీ బేగమ్ అనే మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉంది అని ఆమె బలంగా నమ్ముతోంది. ఈ కేసును ఎలా డీల్ చెయ్యాలో, నిజానిజాలేంటో పోలీసులు పరిశీలిస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: