• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • EXTRA MARITAL AFFAIRS WILL END SOON DUE TO FIVE MAIN REASONS HERE IS THE DETAILS AK GH

Extra marital affairs: వివాహేతర సంబంధాలు తొందరగా ముగుస్తాయి.. అందుకు 5 కారణాలు

Extra marital affairs: వివాహేతర సంబంధాలు తొందరగా ముగుస్తాయి.. అందుకు 5 కారణాలు

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ ఇచ్చేవారు తగ్గిపోతున్నారు. కారణాలు ఏవైనా వివాహేతర సంబంధాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన?

  • Share this:
ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ ఇచ్చేవారు తగ్గిపోతున్నారు. కారణాలు ఏవైనా వివాహేతర సంబంధాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ తాత్కాలిక బంధాలు. సరదాలు, వ్యామోహం వంటివి ఇలాంటి ప్రమాదకరమైన బంధాలకు దారితీస్తాయి. నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వనివారు వివాహేతర సంబంధాల వలలో చిక్కుకుంటారు. ఇలాంటివి సరదాలు, సంతోషాలతో ప్రారంభమై విభేదాలు, విషాదంతో ముగుస్తాయి. వివాహేతర సంబంధాలు ముగియడానికి కొన్ని హాస్యాస్పదమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే..

* లైంగిక సంతృప్తి లేకపోవడం
వివాహేతర సంబంధాలకు పునాదులు వేసేది శారీరక సుఖం. సెక్స్ విషయంలో భాగస్వామితో ఉండే అసంతృప్తి వల్ల ఇతరులతో సెక్సువల్ రిలేషన్ గురించి ఆలోచిస్తారు. వేరొకరితో వివాహేతర సంబంధంలో కూడా లైంగిక సంతృప్తి కలగకపోతే.. వారితో కూడా సంబంధాలు తెంచుకుంటారు. సెక్స్ విషయంలో సంతృప్తిని ఇవ్వలేకపోతే, వారితో సంబంధాలు అనవసరమని భావిస్తారు.

* అతి ప్రేమ.. సమయం కేటాయించకపోవడం
దంపతుల నుంచి ప్రేమ, ఆప్యాయత లభించనివారు.. వాటిని వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న వారి నుంచి ఆశిస్తారు. వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవడంతో పాటు అతిగా ప్రేమిస్తారు. సమయం దొరికిన ప్రతిసారీ ఫోన్ చేసి మాట్లాడతారు. కానీ అదే సమయంలో అవతలివారు వారి కుటుంబంతో లేదా పిల్లలతో గడిపేటప్పుడు పర్సనల్‌గా మాట్లాడే అవకాశం ఉండదు. ఫలితంగా వివాహేతర సంబంధం కొనసాగించే వారికి సమయం కేటాయించలేరు. దీనివల్ల క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగి విడిపోతారు.

* పెరిగే ఖర్చులు
వివాహేతర సంబంధాల్లో వ్యక్తులు తెలియకుండానే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. వారితో గడిపేందుకు హోటళ్లకు వెళ్లాల్సి వస్తుంది. విలాసవంతమైన హోటల్‌లో ఒక్క రాత్రికి రూమ్ బుకింగ్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. క్రమంగా ఇది వ్యక్తుల ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. ఆ డబ్బును ప్రస్తుతం ఉన్న కుటుంబం కోసం కేటాయించాలనే ఆలోచన వస్తే.. వివాహేతర సంబంధం ముగుస్తుంది.

* వారి వయసు ఎక్కువ కావడం
సాధారణంగా వివాహేతర సంబంధాలకు తమకంటే ఎక్కువ వయసు ఉన్న వారితోనే ఏర్పరచుకుంటారు. శారీరక సుఖానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు పెద్ద వయసు వారితో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ సెక్స్ కాకుండా ఇతర విషయాల గురించి ఆలోచించినప్పుడు, ఈ బంధాలు తెగిపోతాయి. లైంగిక అవసరాల గురించి ఆలోచించడం మానేసిన తరువాత వారిని వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెడతారు.

* అన్ని విషయాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం
దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వారితో అణిగి మనిగి ఉన్నా ఇబ్బందిగా అనిపించదు. కానీ కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఏర్పరచుకున్న వివాహేతర సంబంధాల్లో.. ఎదుటి వారి ముందు అన్ని విషయాల్లో తగ్గి ఉండటం సాధ్యం కాదు. ఈ విషయంపై సెక్స్ పార్ట్నర్‌తో ఎదురయ్యే విభేదాలు వివాహేతర సంబంధాలకు ముగింపు పలుకుతాయి.
First published:

అగ్ర కథనాలు