Home /News /crime /

EXTRA MARITAL AFFAIRS UPSET OVER LOVERS MURDER WOMAN 40 DIES BY SUICIDE IN RAJASTHAN PAH

Affair : మేనల్లుడితో భార్య ఎఫైర్.. ప్రియుడి ఎడబాటు భరించలేక భర్తకు ఊహించని షాక్ ఇచ్చిన భార్య.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: ఇంటికి తరచుగా మేనల్లుడు వస్తుండే వాడు. ఈ క్రమంలో వివాహితతో చనువు ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

ప్రస్తుతం కొంత మంది పెళ్లి బంధానికి ఉన్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. పెళ్లైన తర్వాత కూడా వివాహేతర సంబంధాలు (Extra marital affairs) కొనసాగిస్తు సభ్యసమాజం ముందు తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. వీరి ప్రవర్తన కారణంగా కుటుంబాలలో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. పచ్చని కాపురాలు కాస్త రోడ్డున పడుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పిల్లలు సమాజంలో చిన్నచూపుకు గురౌతున్నారు. ఇలాంటి ఘటనలలో కొన్ని సార్లు.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో వీరు.. హత్యలు చేయడానికి కూడా వెనుకాడం లేదు. దీంతో నేరస్థులుగా మారిపోతున్నారు. ఇలాంటి ఉదంతాలు ప్రతి రోజు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) దారుణమైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక వివాహిత చేసిన తప్పు.. రెండు ప్రాణాలు కోల్పోయాయి. బికనీర్ జిల్లాకు చెందిన ఒక మహిళ.. తన మేనల్లుడితో ఎఫైర్ (Affair) పెట్టుకుంది. దీన్ని గుర్తించిన భర్త.. పద్ధతి మార్చుకొవాలని ఎన్నో సార్లు భార్యకు సూచించాడు. అయిన భార్య పద్ధతిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో భర్త.. తీవ్ర మనస్తాపనికి గురయ్యాడు. భార్య ప్రియుడిని (lover) మాట్లాడుకుందామని పిలిచి, మద్యం తాగించాడు. ఆ తర్వాత.. అతడిని హత్యచేశాడు. అయితే, తన ప్రియుడిని భర్త ఆదివారం చంపేశాడనే విషయం వివాహితకు తెలిసింది.

దీంతో ఆమె తన ఎడబాటును భరించలేకపోయింది. తన ప్రియుడు లేని లోకంలో తాను కూడా ఉండకూడదనుకుంది. వెంటనే శ్రీదున్‌గర్‌ఘర్ ప్రాంతంలో ఉన్న రైల్వేస్టేషన్ కు వెళ్లింది. అక్కడ వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి సూసైడ్ చేసుకుంది. దీంతో సోమవారం పోలీసులు రైల్వే ప్లాట్ ఫామ్ సమీపంలో మహిళ చనిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధం బైట పడటంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక బాలిక తన తండ్రి టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంది.

రంగరెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని నందిగామ మండలం బుగ్గొనిగుడ గ్రామానికి మనీషా చేగూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో పదో తరగతి చదువుతోంది. సోదరుడు శ్రవణ్‌ సమీపంలోని కాన్హా శాంతి వనంలో ఎలక్ట్రికల్‌ స్టోర్‌ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు. టెన్త్ ఎగ్జామ్స్‌ కారణంగా సోదరుడి ఇంట్లో ఉంది మనీష. అయితే ఇంట్లో తండ్రి నర్సింహులు మద్యం తాగొచ్చి కూతుర్ని వేధించడం, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇంట్లో తండ్రి పెట్టే టార్చర్ భరించలేకపోయిన మనీషా ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు సూసైడ్ లెటర్‌ రాసి తన చావుకు కారణం తండ్రేనని మా డాడీ వెరీ బ్యాడ్ అంటూ పేర్కొంది. అతడ్ని నాన్న అని పిలవాలంటేనే అసహ్యం వేస్తోందని సూసైడ్‌ లెటర్‌లో రాసింది మనీష. టెన్త్‌ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న విషయాన్ని మనీష సోదరుడు శ్రవణ్‌ ద్వారా తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Extra marital affair, Illegal affair, Love affair, Rajasthan

తదుపరి వార్తలు