కొందరు పవిత్రమైన వివాహ బంధానికి మాయని మచ్చ తీసుకొస్తున్నారు. అక్రమ సంబంధాలు (Extra marital affairs) పెట్టుకుంటూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తు తమ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తమ పరువును బజారుకు ఈడ్చుకుంటున్నారు. కొంత మంది పెళ్లైన తర్వాత.. కూడా ఎఫైర్ లు కొనసాగిస్తున్నారు. భార్యకు తెలియకుండా.. భర్త కొన్ని చోట్ల ఎఫైర్ లను నడిపిస్తుంటే.. మరికొన్ని చోట్ల భర్తలు కూడా వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారు. కొందరు ఎఫైర్ లు (Affairs) పెట్టుకుంటు తమ వారికి అడ్డంగా దొరికిపోయిన సంఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి. దీంతో దాడులు, హత్యలు చేయడానికి కూడా వెనుకాడం లేదు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. తమిళనాడులోని (Tamil nadu) సేలం జిల్లాలో దారుణం జరిగింది. శక్తివేల్ (37), పుగళరసి (27) భార్య భర్తలు. వీరు వీరభద్రన్ కోట్టై గ్రామంలో కూలీపనులు చేస్తున జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పుగళరసికి.. ముత్తుకుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచుగా (Affair) కలుసుకునే వారు. ఇది గమనించిన భర్త.. శక్తివేల్ పద్దతి మార్చుకొవాలని భార్యను పలుమార్లు హెచ్చరించారు.
దీంతో పలుమార్లు వీరి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో పుగళరసి, తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. భర్త అడ్డుని (Illegal affair) తొలగించుకోవాలని పథకం పన్నింది. శక్తివేల్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అతనికి అన్నంలో పురుగుల మందు కలిపి పెట్టింది. మద్యం మత్తులో కింద పడిపోయి చనిపొయినట్లు నమ్మించాలను కుంది. కానీ పుగళరసి, పై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారించారు. తమ దైన శైలీలో విచారించగా ప్రియుడితో బతకడం కోసం ఇలా చేశానని ఒప్పుకుంది. దీంతో పుగళరసి, ముత్తుకుమార్ లను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ఏపీలోని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) ప్రొద్దటూరుకు చెందిన రవి.. కొన్నేళ్ల క్రితం అనురాధతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఐతే గత ఐదేళ్లుగా ప్రకాశ్ నగర్ కు చెందిన ఇమ్మానియేల్ అనే వ్యక్తితో అనురాధ వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఇది తెలిసిన భర్త రవి.. భార్యను మందలించాడు. ఐతే అతడి మాట వినకపోగా.. భర్త, పిల్లల్ని వదిలేసి ప్రియుడితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. భర్త ఎదుటే ప్రియుడితో కలిసి తిరుగుతోంది. ఐతే పిల్లల కోసం ఇదంతా భరించిన రవి.. ఆమెను ఇంటికి వచ్చేయాల్సిందిగా బ్రతిమిలాడాడు. పిల్లలు అమ్మా అమ్మా అని తపిస్తున్నారని.. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై ఇంటికి వస్తే హాయిగా ఉందామని చెప్పాడు. కానీ అనురాధ మాత్రం.. తాను వచ్చేది లేదని.. ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది.దీంతో విసిగిపోయిన రవి.. తనకు భార్యను, పిల్లలకు తల్లిని దూరం చేసింది ఇమ్మానియేల్ అని భావించి అతడిపై పగపెంచుకున్నాడు.
నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్.. ఎప్పటికేనా నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తానంటూ ఇమ్మానియేల్ కు వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇమ్మానియేల్ ను హత్య చేసేందుకు ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఈ క్రమంలో ప్రకాశ్ నగర్లోని ఇటుకల బట్టీ వద్ద అతడు అరుబయట నిద్రిస్తున్నాడని తెలుసుకున్న రవి.. వెంటనే అక్కడికి వెళ్లి చాకుతో అతడ్ని విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం బైక్ పై పరారయ్యాడు. అప్పటికే హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. మోడంపల్లి బైపాస్ రోడ్డులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Illegal affairs, Tamilnadu