హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: వామ్మో.. ప్రియుడి మోజులో పడ్డ భార్య.. టెక్నాలజీని ఒక రేంజ్ లో వాడుకుంది.. ఐదు నెలలుగా ప్లాన్ లు..

OMG: వామ్మో.. ప్రియుడి మోజులో పడ్డ భార్య.. టెక్నాలజీని ఒక రేంజ్ లో వాడుకుంది.. ఐదు నెలలుగా ప్లాన్ లు..

నిందితురాలు జీబా

నిందితురాలు జీబా

Delhi: భర్తతో కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యకు ఫేస్ బుక్ లో ఒక యువకునితో పరిచయం ఏర్పడింది. చనువు పెరగటంతో ప్రతి రోజు మాట్లాడుకునే వారు.

కొంత మంది సభ్య సమాజంముందు తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్ర మైన వివాహ బంధానికి మాయని మచ్చ తీసుకు వస్తున్నారు. పెళ్లైన (Marriage) తర్వాత కూడా ఎఫైర్ లు (Affairs)  పెట్టుకుంటూ, తమ కుటుంబాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనల వలన వారి కుటుంబ పరువు, పిల్లలు సమాజం ముందు అపఖ్యాతి పాలవుతున్నారు. ప్రతి రోజు వివాహేతర సంబంధాలకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక దారుణం ఆలస్యంగా వెలుగులోనికి చూసింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. స్థానికంగా ఉండే దర్యాగంజ్(Daryaganj)  ప్రాంతంలో జీబా, మొయినుద్దీన్ ఖురేషీ భార్యభర్తలు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. కాగా, వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. కొన్ని నెలలుగా వీరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆమెకు సోషల్ మీడియాలో (Social media) షోయబ్ అనే యువకుడితో (lover) పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారి, వివాహేతర సంబంధానికి (Extra marital affair)  దారితీసింది. ఇద్దరు తరచుగా కలుసుకునే వారు. భర్తను అడ్డు తొలగించుకుంటే మనం సంతోషంగా ఉండొచ్చని జీబా భావించింది.

ఈ క్రమంలో భర్తను హత్య చేయడానికి పలుమార్లు ప్లాన్ వేశారు.కానీ అతను తప్పించుకున్నాడు. కాగా, షోయబ్..యూపీకి (Uttar pradesh) చెందిన గోస్వామి మరో వ్యక్తితో కలసి చంపడానికి ప్లాన్ వేశారు. దీనికోసం యూపీలో ఒక బైక్ ను దొంగలించారు. ఆరు లక్షల సుపారీ కూడా ఇచ్చారు. కాగా, మే 17 న అర్ధరాత్రి మొయినుద్దీన్ ఇంటిబయట యూరిన్ పాస్ చేయడానికి వెళ్లాడు. అప్పటికే ఇంటి బయట, గ్యాంగ్ కాచుకుని ఉన్నారు. వారు.. మొయినుద్దీన్ పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు.

తెల్లవారు జామున.. మొయినుద్దీన్ రక్తపు మడుగులో ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి భార్య ప్రవర్తన అనుమానంగా ఉండటంతో ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

మొయినుద్దీన్ భార్య టెక్నాలజీని ఉపయోగించి, ఎప్పటి కప్పుడు తన భర్త కదలికలను, ప్రియుడికి చేరవేసేది. అదే విధంగా, వాట్సాప్ అబౌట్ ఫీచర్ ఉపయోగించి భర్త హత్యకు కుట్రపన్నిందని పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపింది. దీంతో ఆమె నేరం అంగీకరించింది. పోలీసులు దర్యాగంజ్ ప్రాంతంలో తెలుపు రంగు బైక్ ను స్వాధీనంచేసుకున్నారు. దానిపైన వచ్చి నిందితులు హత్య చేసినట్లు మహిళ చెప్పింది. జీబా తెలిపిన వివరాల ప్రకారం.. గోస్వామి, షోయబ్ మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

First published:

Tags: Burtally murder, Crime news, Delhi, Extra marital affair

ఉత్తమ కథలు