Pune 19 yr old girl held for killing former lover: కొందరు పెళ్లికి ఉన్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకొని వివాహేతర సంబంధాలు కొనసాగిస్తు.. అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వీరు పాశ్యాత్య ధోరణులు, సినిమాలు చూసి చెడు మార్గాన్ని అనుసరిస్తున్నారు. దీంతో వీరి కుటుంబంతో పాటు, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ ఎఫైర్స్ ను (Extra marital Affair)నడపడంతో మహిళలు, పురుషులు ఏమాత్రం అతీతులు కాదు. ఒకరికి తెలియకుండా, మరొకరితో ఎఫైర్స్ పెట్టుకుని తమ జీవితాలను బజారుకి ఈడ్చుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలో నిలిచింది.
పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని (Maharashtra) పూణెలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పూణెలోని చకన్ లోనిన అగర్కర్ వాడి రోడ్డులో సంజయ్ వాసుదేవ్ పాటిలో(40) ఉండేవాడు. అతనికి ఇదివరకే పెళ్లి అయ్యింది. ఇతగాడు.. తన ఆఫీసులో పనిచేస్తున్న (Office affair) నేహా జాదవ్ (19) తో పరిచయం (Girl friend) ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి (Affair) దారితీసింది. అయితే, కొన్ని రోజుల పాటు వీరి ఎఫైర్ సాగింది. కానీ ఈ మధ్య యువతికి, మరో అదే ఆఫీస్ లో ప్రేమ్ ఉఘాడే అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో పాటిల్ ను ఆమె దూరం పెట్టింది. నేహ జాదవ్, ప్రేమ్ ఉఘాడ్ తో కలిసి తరచుగా బయటకు వెళ్లేవారు.
దీంతో పాటిల్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆ యువతిని తరచుగా బెదిరించేవాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించేవాడు. దీంతో తమ బాగోతానికి అడ్డువస్తున్నాడని యువతి ఒక ప్లాన్ వేసింది. మాట్లాడుకుందామని చెప్పి.. పాటిల్ ను అగర్కర్ రోడ్డుకు రప్పించింది. అప్పటికే అక్కడ రాడ్ తో రెడీ గా ఉన్న.. ప్రేమ్ ఉఘాడే, నేహ అతనికి పై దాడికి పాల్పడ్డారు. రాడ్ తో అతని తలపై కొట్టారు .
దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతకి తన భర్త రాకపోవడంతో, పాటిల్ భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులకు ఒక చోట పాటిల్ పడి ఉన్నట్లు తెలిసింది. దీంతో అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించి ప్రతీక్, నేహలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extra marital affair, Illegal affair, Love affair, Maharashtra