EXTRA MARITAL AFFAIR LEADS TO WOMANS MURDER IN NELLORE
ఆ మహిళ హత్య వెనక ట్విస్టింగ్ క్రైమ్ స్టోరీ
మహిళ హత్య (ఫైల్ ఫొటో)
ప్రియుడి కోసం భర్తను చంపేసే మహిళల్ని చూస్తున్నాం. వివాహేతర సంబంధాలు పెట్టుకొని అడ్డదారులు తొక్కుతున్న మొగుళ్ల బాగోతాలు వింటున్నాం. ఇది మరో రకమైన నేరం. అసలిది ఎలా జరిగింది? అందుకు దారితీసిన పరిణామాలేంటి? అన్నవి తెలుసుకుందాం.
నెల్లూరులోని ఓ ఇంటికి రోజూ వచ్చే కూరగాయల బండి అతను ఆ రోజూ వచ్చాడు. అమ్మా కూరగాయలు కావాలా అంటూ ఇంట్లోకి తొంగి చూశాడు. షాకయ్యాడు. నెత్తుటి మడుగులో విగతజీవిలా పడివున్న మహిళ కనిపించింది. తల దాదాపు బద్దలైనట్లు ఉంది. అంతే... గట్టిగా కేకలు వేస్తుంటే... చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యంగా చూశారు. హడావుడిగా అక్కడికి వచ్చారు. విషయం అర్థమైంది. అందరిలోనూ ఒకే రకమైన ప్రశ్నలు. ఆమె ఎవరు? ఆమెన చంపిందెవరు? ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ జనంలో ఎవరో బుద్ధిమంతులు కాల్ చేయడంతో కాసేపటికే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. చనిపోయిన మహిళ భర్త దగ్గర్లోని రైస్ మిల్లులో పనిచేస్తున్నాడని తెలియడంతో... అతనికి కాల్ చేశారు. పది నిమిషాల్లో అక్కడికి వచ్చిన భర్త... తనే హత్య చేసినట్లుగా ఫేస్ పెట్టాడు. "ఆమెను ఎందుకు చంపావ్" అని ప్రశ్నిస్తే... తనకేమీ తెలీదని అమాయకంగా చెప్పాడు. పోలీసులు గట్టిగా అడిగేసరికి... అసలేం జరిగిందో చెప్పాడు.
అక్కడ చిచ్చు.. ఇక్కడ హత్య:
శ్రీకాకుళంకి చెందిన లక్ష్మీనారాయణ, శ్యామల (28) భార్యాభర్తలు. వాళ్లకు ఓ పాప, బాబు ఉన్నారు. ఈ కుటుంబం ఉండే వీధిలో... రాజు అనే అకతాయి గాలితనంగా తిరిగేవాడు. అడ్డమైన జోకులూ వేస్తూ... చుట్టుపక్కల వాళ్లను నవ్వించేవాడు. అతని కన్ను శ్యామలపై పడింది. వీలు దొరికినప్పుడల్లా ఆమె వెంట తిరగడం, ప్రేమిస్తున్నా అంటూ వేడుకోవడం కామనైపోయింది. పదే పదే ఐలవ్యూ చెబుతుంటే... ఎందుకో ఆమెకు అది నచ్చింది. అతనికి ఎట్రాక్ట్ అయ్యింది. కట్ చేస్తే... అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న భర్త ఓ రోజు పెద్దల పంచాయితీ పెట్టించాడు. వాళ్లు రాజును గట్టిగా మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే... చంపేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ క్షణం రాజు సైలెంటయ్యాడు.
లక్ష్మీనారాయణకు ఎక్కడో డౌట్ వచ్చింది. ఈ రాజును నమ్మలేం అనుకున్నాడు. ఇలాంటి కొండెగాళ్లతో ప్రమాదమే. మకాం మార్చేయడమే మంచిది అనుకున్నాడు. శ్రీకాకుళం నుంచీ ఫ్యామిలీతో నెల్లూరు వచ్చేశాడు. పిల్లల్ని స్థానిక స్కూల్లో వేశాడు. దగ్గర్లోని రైస్ మిల్లులో పని వెతుక్కున్నాడు. శ్యామల ఫోన్ నంబర్ రాజు దగ్గర ఉంది. అంతే... వీళ్లు నెల్లూరు వచ్చిన నెల తర్వాత... రాజు ఇక్కడ వాలిపోయాడు. మళ్లీ అదే ఐలవ్యూ... అదే వ్యవహారం.
తెరవెనక జరుగుతున్న యవ్వారం తెలియని లక్ష్మీనారాయణ... తన ఫ్యామిలీతో హాయిగా ఉండసాగాడు. కానీ రాజు గోల రోజురోజుకూ ఎక్కువైంది. నువ్వు లేకపోతే నేను బతకలేను. నాతో వచ్చేయ్. మనం కలిసి జీవిద్దాం. నీ భర్తను వదిలేసెయ్ అనడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై చర్చ జరిగినప్పుడల్లా ఆమె ఖండిస్తూ వచ్చింది. ఇలా నాలుగైదుసార్లు జరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
తాజాగా మరోసారి రాజు ఇదే గోల చేశాడు. వస్తావా రావా అంటూ బలవంతం చేశాడు. "ఎందుకు రావాలి? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నీతో వస్తే, నన్నెలా పోషిస్తావు? జీవితం అంటే పడుకోవడం ఒక్కటే కాదు" అంటూ ఆమె గట్టిగానే మందలించింది. అవేవీ రాజు బుర్రకు ఎక్కలేదు. తన పంతమే నెగ్గాలనుకున్నాడు. రావాల్సిందే అంటూ బలవంతంగా లాక్కుపోవాలని చూశాడు. ఆమెకు ఒళ్లు మండింది. ఆవేశంలో ఇష్టమొచ్చినట్లు తిట్టింది. ఇక జీవితంలో తన గడప తొక్కొద్దంటూ ఇంట్లోంచీ బయటకు నెట్టింది. మొహంమీదే తలుపు వేసేద్దామని ప్రయత్నించింది. అడ్డుకున్న రాజు... ఆవేశంతో లోపలికి వచ్చాడు. ఆమె దురదృష్టం కొద్దీ అతని కళ్లకు పక్కనే ఉన్న రోకలి బండ కనిపించింది. దాంతో ఆమె తలపై గట్టిగా రెండుసార్లు కొట్టాడు. అంతే... మరుక్షణంలో రక్తం ప్రవాహమై సాగింది. ఆమె గిలగిలా కొట్టుకుంటుంటే సినిమా చూసినట్లు చూశాడే తప్ప జాలిపడలేదా కఠిన కర్కోటకుడు. ఆమె చనిపోవడంతో అక్కడి నుంచీ పరారయ్యాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు రాజు కోసం గాలిస్తున్నారు. ఆ దుర్మార్గుడు శ్రీకాకుళం వెళ్లలేదని తెలిసింది. వాడు దొరకడం, శిక్ష పడటం ఎప్పటికైనా జరిగేదే. కానీ ఇక్కడో కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. ఇద్దరు పిల్లలు తల్లిలేనివాళ్లయ్యారు. ఆ భర్తకు తోడు లేకుండా పోయింది. వివాహేతర సంబంధం తప్పుకాదని సుప్రీంకోర్టు చెప్పింది కదా అని కమిటైపోకూడదు. వివాహేతర సంబంధం సామాజిక తప్పిదమేనని అదే తీర్పులు అదే సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కూడా గుర్తించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.