• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • EXTRA MARITAL AFFAIR LEADS TO HUSBAND MURDER IN BIHAR GAYA DISTRICT SSR

Extra Marital Affair: దారుణాన్ని కళ్ల ముందుంచిన వదినమరిది వివాహేతర సంబంధం.. మంచంపై కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే..

విగత జీవిగా మంచంపై రాజేంద్ర మాంఝీ

గయా జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ తాలూకాలోని బరఘట్ గ్రామానికి చెందిన రాజేంద్ర మాంఝీ, రీనా దేవి భార్యాభర్తలు. రాజేంద్ర మాంఝీ తమ్ముడు జీతూ మాంఝీ. రాజేంద్ర మాంఝీ కళ్లుగప్పి గత కొన్ని నెలలుగా రీనా దేవి, జీతూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.

  • Share this:
    గయా: వివాహేతర సంబంధాల మోజులో పడి వావివరుసలు మర్చిపోతున్నారు. వదిన, మరిది మధ్య తల్లికొడుకుల మధ్య ఉండే అనుబంధం ఉంటుంది. కానీ.. ఆ బంధానికే మాయని మచ్చ తెస్తూ కొందరు వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. అన్న భార్య అనే సంగతి తెలిసి కూడా కొందరు రాసలీలలు సాగిస్తున్నారు. కొందరు మహిళలు కూడా కొడుకు లాంటి మరిదితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనే.. బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది. అన్న భార్యతో అఫైర్ నడుపుతున్న తమ్ముడు, ఆ మహిళ కలిసి అతనిని గుట్టుచప్పుడు కాకుండా చంపేశారు. ఉదయం లేచి చూసేసరికి అతని శవం మంచంపై కనిపించింది. అనారోగ్యం కారణంగానే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ స్థానికులకు ఈ వదినమరిది అఫైర్ గురించి అప్పటికే తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు చనిపోయిన అతని మృతదేహం మెడపై గాయాన్ని గుర్తించారు. దీంతో.. హత్య చేసినట్లు తేల్చారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. గయా జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ తాలూకాలోని బరఘట్ గ్రామానికి చెందిన రాజేంద్ర మాంఝీ, రీనా దేవి భార్యాభర్తలు. రాజేంద్ర మాంఝీ తమ్ముడు జీతూ మాంఝీ. రాజేంద్ర మాంఝీ కళ్లుగప్పి గత కొన్ని నెలలుగా రీనా దేవి, జీతూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. రీనా దేవికి ముగ్గురు పిల్లలు. జీతూ, రీనా దేవి మొదట్లో వదినమరిదిలానే ఉన్నారు. రానురానూ ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఆ చనువే వివాహేతర సంబంధానికి దారితీసింది. జీతూ నచ్చడంతో రీనా దేవి కూడా అతనితో అఫైర్ కొనసాగించింది. ఇద్దరూ వావివరుసలను మర్చిపోయారు. అయితే.. ఇటీవల తన భార్యతో తమ్ముడి వివాహేతర సంబంధం గురించి రాజేంద్ర మాంఝీకి తెలిసింది. వదిన, మరిది.. ఇద్దరినీ మందలించి హెచ్చరించాడు. దీంతో.. అప్పటి నుంచి రాజేంద్రను అడ్డు తొలగించుకుంటేనే కలిసి ఉండే అవకాశం ఉంటుందని భావించిన జీతూ, రీనా దేవి.. రాజేంద్రను చంపాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం.. ఇంటి బయట మంచంపై నిద్రిస్తున్న రాజేంద్ర మాంఝీని అతని తమ్ముడు జీతూ, భార్య రీనా దేవి కలిసి మెడకు తాడు బిగించి.. ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఏమీ తెలియనట్టు ఉదయాన్నే రీనా దేవి మంచంపై ఉన్న భర్తను చూసి ఏడుస్తూ కేకలేసింది.

    ఇది కూడా చదవండి: Affair: ఈ 23 ఏళ్ల కుర్రాడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని 25 కేజీల ఉప్పుతో కథ ముగించేశారు..

    ఉలుకూపలుకూ లేకుండా పడి ఉన్నాడని ఇరుగుపొరుగుకు చెప్పగా వచ్చి చూస్తే రాజేంద్ర మాంఝీ చనిపోయాడు. వదిన కుట్రలో భాగమైన జీతూ కూడా అన్న చనిపోయాడని మొసలి కన్నీరు కార్చాడు. గ్రామస్తులకు ఈ వదినమరిదితో అఫైర్ గురించి రాజేంద్ర గొడవపెట్టుకున్నాడన్న సంగతి గుర్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి పోలీసులకు చెప్పారు. పోలీసులు రాజేంద్ర మాంఝీ శవాన్ని పరిశీలించగా గొంతు కమిలిపోయి.. ఉరేసి చంపినట్లు తేలింది. దీంతో.. ఈ వదినమరిది నాటకానికి తెరపడింది. అయితే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను వచ్చిన తర్వాత గానీ ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published: