Suicide: అండమాన్ లో భర్త.. ఆంధ్రాలో భార్య..ఇద్దరూ ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

విశాఖనగరంలో (Visakhapatnam) వివాహేతర సంబంధం (Extra Marital Affair) ముగ్గురి ప్రాణాలు బలిగొంది. భార్యభర్తలతో పాటు భార్య ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Share this:
    ఉపాధి కోసం భర్త దూరప్రాంతానికి వెళ్లాడు. భార్య మాత్రం సొంతూళ్లోనే ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు వచ్చాయి. కలిసి కాపురం చేయలేక విడిగా ఉంటున్నారు. ఇదే సమయంలో భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి భర్త సూసైడ్ చేసుకోగా.. ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లిద్దరు కూడా తనువు చాలించారు. సినిమా స్టోరీని తలపించే ఈ స్టోరీ విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని సుందరయ్య కాలనీకి చెందిన నాగిణి అనే మహిళకు ఐదేళ్ల క్రితం పాపారావు అనే వ్యక్తితో పెళ్లైంది. వృత్తిరీత్యా అతడు అండమాన్ లో ఉండేవాడు. దీంతో ఇద్దరి మధ్య కలహాలు మొదలై ఏడాది నుంచి విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో నాగిణికి అభిలాష్ అనే వ్యక్తితో పరిచయమైంది.

    కొన్నాళ్లకు ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అండమాన్ లో ఉన్న పాపారావుకు విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత పాపారావు బంధువులకు నాగిణికి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం నాగిణి.. అభిలాష్ ను వివాహం చేసుకుంది. వీళ్లిద్దరి పెళ్లిని ఇరువైపుల పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి బ్రతకలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

    కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంలో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. భార్య తనను మోసం చేసిందని పాపారావు సూసైడ్ చేసుకోగా..జరిగిన దానికి తలెత్తుకోలేక..కొత్త జీవితాన్ని పెద్దలు అంగీకరించలేదన్న బాధను భరించలేక నాగిణి-అభిలాష్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మనస్పర్ధలు, అసంతృప్తి, ఆకర్షణ కలిసి మూడు నిండు జీవితాలను బలితీసుకున్నాయి.
    Published by:Purna Chandra
    First published: