హోమ్ /వార్తలు /క్రైమ్ /

అదనపు కట్నం కోసం అరాచకం... యువతి ఆత్మహత్య... 2 నెలల తర్వాత బయటపడిన నిజం

అదనపు కట్నం కోసం అరాచకం... యువతి ఆత్మహత్య... 2 నెలల తర్వాత బయటపడిన నిజం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dowry harassment: పెళ్లి చేసుకున్న భార్యను కట్నం కోసం హింసించాలనే దుర్మార్గపు బుద్ధి ఎలా వస్తుందో... మనుషుల్లో కొందరు ఎందుకు అలా ప్రవర్తిస్తారో... ఈ కేసులో మిస్టరీ ఎలా రివీల్ అయ్యింది... 2 నెలల తర్వాత ఏం జరిగింది?

  Dowry harassment: నిజాన్నీ, శవాన్నీ దాచినా దాగవు... ఎప్పుడోకప్పుడు బయటపడి తీరతాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విషాద కథ. తమిళనాడులోని తిరుముల్లాయ్ వోయల్‌లో యువతి చనిపోయిన 2 నెలల తర్వాత పోలీసులు... ఆమె భర్తను, అత్తింటివారిని అరెస్టు చేశారు. వీళ్లంతా కలిసి... కట్నం కోసం వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల ప్రకారం... మృతురాలు జ్యోతిస్రీ... గతేడాది డిసెంబర్‌లో బాలమురుగన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో... అమ్మాయి తరపు వారు కట్నంగా అడిగిన అన్నీ ఇచ్చారు. డబ్బుతోపాటు... నగలు, విలువైన వస్తువులు, సారె అన్నీ ఇచ్చారు. పెళ్లి సమయంలో... మంచి వాళ్లలా నటింటిన అత్తింటి వారు... నవ్వుతూ అన్నీ తీసుకున్నారు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అన్నారు.

  తీరా ఆమె అత్తింట్లో అడుగుపెట్టాక... వాళ్ల అసలు స్వరూపం బయటపడింది. రోజూ సూటిపోటి మాటలు. కట్నం సరిగా ఇవ్వలేదని చీదరింపులు. ఇంకెవరితోనైనా పెళ్లి జరిగి ఉంటే... డబుల్ కట్నం వచ్చేదంటూ వేధింపులు. ఆమె ఏం చేసినా ఏదో ఒక వంక పెట్టేవారు. దాంతో... ఆమె డిసెంబర్‌లోనే పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండువైపులా సర్దిచెప్పాక... తిరిగి ఏప్రిల్‌లో మెట్టినింటికి వెళ్లింది.

  ఇక అప్పటి నుంచి ప్రెషర్ మరింత పెంచారు. రాత్రైతే చాలు... పడక గదిలో భర్త నుంచి ఒత్తిళ్లు. మీ నాన్నను అడిగి మరింత కట్నం తీసుకురా... మనకు డబ్బు కావాలి కదా అంటూ... నాటకాలు. ఇలా మెట్టినిల్లు నరకంలా మారడంతో... ఆమె తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైంది. మరింత డబ్బు కావాలని తన పేరెంట్స్‌ని అడిగి వారిని ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదనుకున్న ఆమె... తాను చనిపోతేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంది. అందుకే సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు.

  పుట్టింటి వారి నుంచి కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పద మృతి కేసు రాసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానమూ రాకుండా అత్తింటి వారు... బాగా నటించారు. ఆమెను తాము ఏ ఇబ్బందీ పెట్టలేదనీ... ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందో తమకే తెలియట్లేదని నటించారు. ఐతే... ఆమె మొబైల్ ఫోన్‌లో సూసైడ్ తర్వాత కొన్ని ఫైల్స్ డిలీట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అత్తింటి వారిని అడిగితే... తాము ఏమీ డిలీట్ చెయ్యలేదని చెప్పారు. ఐతే... పోలీసుల దగ్గర... డిలీట్ చేసిన ఫైల్స్‌ను వెనక్కి తీసుకొచ్చే సాఫ్ట్‌వేర్ ఉంది. దాన్ని ఉపయోగించారు. అది డిలీట్ అయిన ఫైల్స్‌ను వెనక్కి తీసుకొచ్చింది. అందులో ఆమె సూసైడ్‌కి సంబంధించిన వీడియో క్లిప్, ఓ సూసైడ్ నోట్ ఉన్నాయి. అందులో ఆమె తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. వాళ్ల వేధింపులు భరించలేకే చనిపోతున్నట్లు మొత్తం చెప్పింది.

  ఇది కూడా చదవండి: Viral Pics: అమ్మాయి వెంటపడిన ఆకతాయిలు... షాకయ్యేలా చితకబాదిన ఆమె వదిన

  సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో... పోలీసులు... ఆమె భర్త, అతని సోదరుడు, తల్లి (అత్త)ని అరెస్టు చేసి... రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇలా సూసైడ్ జరిగిన 2 నెలల తర్వాత ఈ కేసులో నిజానిజాలు బయటపడ్డాయి.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Crime news, Tamil nadu

  ఉత్తమ కథలు