హోమ్ /వార్తలు /క్రైమ్ /

అదనపు కట్నం వేధింపులు.. పెళ్లైన ఆరు నెలలకే మహిళ ఆత్మహత్య.. చివరి క్షణాల్లో భర్తకు ఫోన్

అదనపు కట్నం వేధింపులు.. పెళ్లైన ఆరు నెలలకే మహిళ ఆత్మహత్య.. చివరి క్షణాల్లో భర్తకు ఫోన్

హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్‌ సీఐ రాజేష్‌, ఎస్సై రంజిత్‌కుమార్‌ తన భర్తను మానసికంగా వేధించడంతోనే మృతి చెందాడని.. శ్రీనివాస్ భార్య వెంకట పద్మ ఆరోపించారు. ఈ మేరకు ఆమె అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్‌ సీఐ రాజేష్‌, ఎస్సై రంజిత్‌కుమార్‌ తన భర్తను మానసికంగా వేధించడంతోనే మృతి చెందాడని.. శ్రీనివాస్ భార్య వెంకట పద్మ ఆరోపించారు. ఈ మేరకు ఆమె అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఎన్నో కళలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ మహిళ జీవితం విషాదంగా ముగిసింది. అదనపు కట్నం కోసం వేధింపులు ఆమె ప్రాణాలను బలితీసుకొంది.

ఎన్నో కళలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ మహిళ జీవితం విషాదంగా ముగిసింది. అదనపు కట్నం కోసం వేధింపులు ఆమె ప్రాణాలను బలితీసుకొంది. పెళ్లైన ఆరు నెలలకే పురుగుల మందు తాగిన ఆమె బలవన్మరణం చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. సూర్యాపేటకు చెందిన పెద్దపంగు ప్రణయ్, నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌కు చెందిన ఎడ్ల లావణ్య గత నాలుగు ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలిపి వారి అంగీకారంతో గత ఏడాది జూన్ 12న పెళ్లి చేసుకున్నారు. పళ్లి సమయంలో కట్నం కింద లావణ్య కుటుంబం.. వరుడికి అర ఎకరం వ్యవసాయ భూమి, 4లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం అప్పజెప్పారు. ఇక, ప్రణయ్ సూర్యాపేట మండలం బాలెంలో ప్రభుత్వ వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్నాడు.

పెళ్లైన కొన్ని నెలలు వీరి వివాహ బంధం బాగానే సాగింది. అయితే ఇటీవల ప్రణయ్ కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం లావణ్యపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ప్రణయ్ మూడు రోజుల కిందట లావణ్యను ఆమె పుట్టింటిలో వదిలివచ్చాడు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న లావణ్య.. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందింది.శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది.

భర్తకు ఫోన్ చేసి..

పురుగుల మందు తాగిన లావణ్య భర్తకు ఫోన్ చేసింది. ఆ సమయంలో లావణ్య మాటల్లో తడబాటును గమనించిన ప్రణయ్ ఏమైంది అంటూ ప్రశ్నించాడు. అందుకు బుదులిచ్చిన లావణ్య.. "నన్ను వదిలేశావుగా, నేను చనిపోతున్నాను"అని చెప్పింది. దీంతో ఆందోళన చెందిన ప్రణయ్ వెంటనే.. ఈ విషయాన్ని లావణ్య కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు ఇంటికి వచ్చి చూడగా లావణ్య అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే బంధువులు ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి లావణ్య కన్నుమూసింది. ఇక, పురుగుల మందు తాగాక.. ప్రణయ్‌తో లావణ్య మాట్లాడిన చివరి మాటాలుగా చెప్పబడుతున్న ఆడియో ఒక్కటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్..

లావణ్య మృతిచెందిన విదషయం తెసుకున్న ప్రణయ్.. ఆత్మహత్యకు యత్నించాడు. తన నివాసంలోనే పురుగుల మందులు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక, ప్రణయ్ చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాశాడు. తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె లేకుండా ఉండలేని పేర్కొన్నాడు. తన భార్య చావుకు ఆమె తండ్రి సుందరయ్యతో పాటు ఆమె బంధువులే కారణమని ఆరోపించారు.

మరోవైపు లావణ్య ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆమె తండ్రి సుందరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన పిర్యాదు మేరకు ప్రణయ్, అతని తల్లిదండ్రులు కరుణానిధి, ఉజ్వల, సోదరుడు సంజీవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక, లావణ్య మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుమార్తె చనిపోయి బాధలో ఉంటే ప్రణయ్ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయలంటూ లావణ్య మృతదేహంతో ప్రణయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

First published:

Tags: Crime news, Dowry harassment, Nalgonda, Suicide, Suryapet

ఉత్తమ కథలు