సూర్యాపేటలో పేలుడు.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.

news18-telugu
Updated: September 13, 2019, 5:16 PM IST
సూర్యాపేటలో పేలుడు.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 13, 2019, 5:16 PM IST
సూర్యాపేటలో తీవ్ర కలకలం రేగింది. ఓ పాత సామాన్ల దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అయ్యప్ప దేవాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించింది. మృతుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన రామచంద్ర సాహు (45)గా గుర్తించారు. రామ్‌కోటి తండాకు చెందిన బుజ్జమ్మ, చిలకమ్మతో పాటు యూపీకి చెందిన సల్మాన్‌కు గాయాలు కావడంతో.. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంకు చెందిన నాగరాజు సూర్యాపేట పట్టణంలో కొంతకాలంగా పాత ఇనుప సామాన్ల దుకాణం నడుపుతున్నాడు. షాపులో పలు రాష్ట్రాలకు చెందిన 15 మంది పనిచేస్తున్నారు. పనికి రాని పాత సామాన్లు సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి హైదరాబాద్‌కు తరలిస్తుంటారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఓ ప్లాస్టిక్ డ్రమ్మును కట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్ధం రావడంతో పట్టణ ప్రజలు వణికిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐతే షాపులో బాంబు పేలుడు జరగలేదని.. పాత వస్తువులను నిర్వీర్యం చేసేందుకు కాలం చెల్లిన యంత్రాలను వాడడం వల్లే పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని వెల్లడించారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...