హైదరాబాద్ రాజేంద్రనగర్లో భారీ పేలుడు సంభవించింది. ఫుట్ పాత్పై ఉన్న ఓ బాక్సును వ్యక్తి తెరిచాడు. బాక్సు తెరవగానే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాక్సు తెరిచిన వ్యక్తి చేతులు తెగిపడ్డాయి. అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పీవీ ఎక్స్ప్రెస్ హైవేపైన పిల్లర్ నెంబర్ 279 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు. భారీ శబ్దంతో పేలుడు సంభవిచండంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.