Home /News /crime /

EXPERIENCED OLD THIEF LOOTS MONEY FROM MAN WHO WENT TO EAT BRIYANI POLICE CAUGHT HIM AFTER WATCHING CCTV FOOTAGE NK

హోటల్‌లో బిర్యానీ తినడానికి వెళ్లాడు.. ఇంతలో డబ్బు చోరీ.. అతితెలివే కొంపముంచిందా?

హోటల్‌లో బిర్యానీ తినడానికి వెళ్లాడు.. ఇంతలో డబ్బు చోరీ.

హోటల్‌లో బిర్యానీ తినడానికి వెళ్లాడు.. ఇంతలో డబ్బు చోరీ.

దొంగల్ని అతను తక్కువ అంచనా వేశాడు. తాను వేసిన ప్లాన్ దొంగలకు తెలియదు అనుకున్నాడు. కానీ అదేం చిత్రమో గానీ... దొంగలు అతని కంటే తెలివిమీరిపోయారు. అలా కూడా మనీ పట్టుకుపోయారు.

    ఈ చిత్రమైన ఘటన చెన్నైలోని... ఈస్ట్ కోస్ట్ రోడ్‌... ఇచ్చంబాక్కంలో జరిగింది. 32 ఏళ్ల కృష్ణస్వామి... పాలప్యాకెట్లు, న్యూస్ పేపర్లు సప్లై చేసే పని చేస్తున్నాడు. గత వారం అతను.. పలవాక్కంలోని... అన్నసలాయ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి రూ.1.5 లక్షలు తీసుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఆ డబ్బును స్కూటీ సీటు కింద దాచాడు. ఆ తర్వాత... అలా అలా వెళ్తుండగా... ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఓ హోటల్ నుంచి బిర్యానీ ఘుమఘుమలు వచ్చాయి. ఆ అరోమా ముక్కుకి తగలగానే... బిర్యానీ ఓ పట్టు పట్టాల్సిందే అనుకున్నాడు. స్కూటీని పార్క్ చేసి హోటల్‌లోకి వెళ్తూ... సీటు కింద డబ్బు ఉంది కాబట్టి... ఎవరూ ఎత్తుకెళ్లరు అనుకున్నాడు. పైగా... ఏ సంచిలోనో డబ్బు ఉంటే... ఆ సంచిని ఎత్తుకుపోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అదే సీటు కింద డబ్బు ఉంటే... అలా ఉంటుందని ఎవరూ ఊహించలేరు. కాబట్టి డబ్బుకి ఢోకా ఉండదు అనుకున్నాడు.

    హోటల్‌లో పాటలు వింటూ... హాయిగా బిర్యానీ లాగించాడు. ఆ తర్వాత సోంపు నములుతూ... కర్చీఫుతో చేతులు తుడుచుకుంటూ... స్కూటీ దగ్గరకు వచ్చాడు. షాక్ అయ్యాడు. సీటు సీటులా లేదు. కొద్దిగా పైకి లేచినట్లు ఉంది. సీటుకి లాక్ లేకుండా ఉంది. సీటు ఓపెన్ చేసి చూస్తే... కింద డబ్బు లేదు. అదేంటి... నేను లాక్ వేశానే. అయినా ఎవరు ఎత్తుకుపోయారు. అసలు సీటు కింద డబ్బు పెట్టానని నాకు తప్ప ఎవరికీ తెలియదు. మరి ఎలా ఎత్తుకెళ్లారు... ఎవరు అని షాకయ్యాడు.

    లబోదిబో మంటూ నీలంగరాయ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. సీటు కింద డబ్బు పెట్టుకోవడమేంటి... అదేం ఆలోచన అని పోలీసులు అనగా... నా అతి తెలివే కొంపముంచింది సార్... ఎలాగైనా ఆ డబ్బు ఇప్పించండి సార్ అని ఆవేదన చెందాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో కత్తిని వంకరగా పట్టుకునే ఓ వ్యక్తిని చూశారు. అలా పట్టుకున్నాడంటే... వాడు వాడే... వాడి పేరు ఏదో ఉంది... అని అనుకుంటూ... పాత డేటా చెక్ చెయ్యగా... ఆ దొంగ 42 ఏళ్ల చిట్టిబాబు అని తెలిసింది. విల్లివక్కంలో వక్కపొడి తింటుండగా అతన్ని పట్టుకున్నారు.

    ఈ చిట్టిబాబు మామూలు దొంగ కాదు. నీటిలో కొంగ జపం చేసినట్లుగా... బ్యాంకుల దగ్గర మాటు వేస్తాడు. అలా ఆ ప్రైవేట్ బ్యాంక్ దగ్గర మాటు వేసినప్పుడు... కృష్ణస్వామి సీటు కింద డబ్బు దాయడాన్ని చూశాడు. అప్పుడే అనుకున్నాడు దాన్ని లేపేయాలని. కృష్ణస్వామిని ఫాలో అయ్యాడు. బిర్యానీ హోటల్‌లోకి వెళ్లగానే... మారు తాళాలతో స్కూటీ సీటును ఓపెన్ చేసి డబ్బు పట్టుకుపోయాడు. ఇతనిపై చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు పెండింగ్ ఉన్నాయని పోలీసులు తెలిపారు.

    ఇది కూడా చదవండి: వామ్మో.. దేవుడో.. అప్పటివరకూ మాస్క్ తప్పదు.. తాజా అంచనా!

    చిట్టిబాబు నుంచి రూ.1.5 లక్షలు సీజ్ చేసిన పోలీసులు ఆ డబ్బును ఇంకా కృష్ణస్వామికి ఇవ్వలేదు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తైనా ఇవ్వలేదు. ఇస్తాం ఇస్తాం అని అంటున్నారు. మరి ఎప్పటికి ఇస్తారో!
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Chennai, Crime news, Crime story, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు