ప్రాణం తీసిన దురాచారం... ‘నెలసరి’ గుడిసెలో ఊపిరాడక ముగ్గురి మృతి...

కొడుకులతో కలిసి ‘నెలసరి గుడిసె’లోకి వెళ్లిన తల్లి... వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటి పెట్టుకున్న తల్లీకొడుకులు... ఊపిరిరాడక ముగ్గురూ మృత్యువాత...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 3:32 PM IST
ప్రాణం తీసిన దురాచారం... ‘నెలసరి’ గుడిసెలో ఊపిరాడక ముగ్గురి మృతి...
గుడిసె నమూనా చిత్రం (Reuters file photo)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 3:32 PM IST
రోదసిలోకి రాకెట్స్, రోబోటిక్స్ అంటూ అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతగా దూసుకుపోతున్నా... నరనరాల్లో కూరుకుపోయిన మూఢనమ్మకాలను మాత్రం వదలలేకపోతున్నాడు మనిషి. తాజాగా అలాంటి ఓ దురాచారమే ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. నేపాల్‌లో ఇప్పటికీ కొన్ని మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నెలసరి సమయంలో మహిళలను ఊరికి దూరంగా... ఓ గుడిసెలో ఉంచే ‘సుష్టి’ సంస్కృతి ఇప్పటికీ అక్కడ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ వింత సంస్కృతి కారణంగా ఓ తల్లీ, ఇద్దరు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. నేపాల్‌లోని బజురా జిల్లాలో అంబా బొహురా అనే 35 ఏళ్ల మహిళ... నెలసరి సమయంలో ఊరికి అవల ఏర్పాటుచేసిన ‘నెలసరి’ గుడిసెలోకి వెళ్లింది.

తనతో పాటు తన ఇద్దరు కొడుకులను కూడా గుడిసెలోకి తీసుకెళ్లింది. తొమ్మిది, 12 ఏళ్ల వయసున్న చిన్నారులు అమ్మతోనే నిద్రపోతామని బెట్టుచేయడంతో ఏం చేయాలో తెలియక.. తనతో పాటు తీసుకెళ్లింది. బాగా చలిగా ఉండడంతో వెచ్చదనం కోసం చిన్న గుడిసెలోనే బొగ్గుల కుంపటి ఏర్పాటుచేసుకున్నారు ముగ్గురు. అయితే గుడిసెలో చిన్న కిటికీ కూడా లేకపోవడంతో గుడిసెలో పొగ చూరుకుని ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు విడిచారు. మూడు రోజులు ‘నెలసరి గుడిసె’లో గడిపిన తర్వాత నాలుగో రోజు ఇలా ప్రమాదం జరగడం విశేషం. నాలుగోరోజు రాత్రి భోజనాలయ్యాక కొడుకులతో కలిసి గుడిసెలో నిద్రించింది అంబా బొహురా... తర్వాతి రోజు ఆమె అత్త వచ్చి గుడిసె తలుపులు తీసి చూడగా... ముగ్గురూ చనిపోయి ఉండడం గమనించింది. బొగ్గుల కుంపటి కారణంగా హైదరాబాద్ నగరంలో తల్లీకొడుకులు, కోళ్ల ఫారంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి...

దొంగతనానికి ‘సాక్ష్యం’ చెబుతానంది... అంతలోనే ఆత్మహత్య... పోలీసుల విచారణ కారణంగా...
థాయిలాండ్‌లో సౌదీ యువతికి అవమానం... ఆస్ట్రేలియా యువతుల ‘టాప్‌లెస్’ నిరసన...


మేనల్లుడి ప్రేయసితో స్నేహం... అతిదారుణంగా చంపి... తులసి మొక్క నాటాడు...

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...