తహశీల్దార్ ఆఫీసులో కిరోసిన్ పోసుకున్న తండ్రీ కూతుళ్లు

తమ భూమిలో కొందరు వ్యక్తులు కర్రలు పాతడంతో తండ్రీ కూతుళ్లైన అప్పారావు, ప్రభ ఈరోజు తహశీల్డార్ కార్యాలయానికి చేరుకొని.. కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు.

news18-telugu
Updated: November 29, 2019, 8:18 PM IST
తహశీల్దార్ ఆఫీసులో కిరోసిన్ పోసుకున్న తండ్రీ కూతుళ్లు
ఆత్మహత్యాయత్నం చేసిన తండ్రీకూతుళ్లు
  • Share this:
తమ భూములు ఆక్రమించుకుంటున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం బర్మా కాలనీకు తండ్రీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేసారు. బర్మా కాలనీలో గొర్లె అప్పారావు, తన కుమార్తె ప్రభకు కొంత భూమి ఉంది. కొంతకాలంగా ఆ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయమై అప్పారావు, ప్రభ తహశీల్దార్ కు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. వారి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు.. గురువారం అర్ధరాత్రి ఆ భూమిలో కర్రలు పాతడంతో తండ్రీ కూతుళ్లైన అప్పారావు, ప్రభ ఈరోజు తహశీల్డార్ కార్యాలయానికి చేరుకొని.. కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రభ కిరోసిన్ ను తాగేయడంతో పరిస్థితి విషమంగా మారంది. దీంతో అక్కడే ఉన్న స్ధానికులు వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.



First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>