వినుకొండలో నాటుసారా కలకలం.. వెయ్యి లీటర్ల ఊట ధ్వంసం

నాటుసారా తయారు చేస్తున్న వారిపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. నూజండ్ల మండలంలో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: April 4, 2020, 5:34 PM IST
వినుకొండలో నాటుసారా కలకలం.. వెయ్యి లీటర్ల ఊట ధ్వంసం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. దీంతో అత్యవసర సేవలు మినహా ఇంకేం అందుబాటులో ఉండడం లేదు. మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అక్కడక్కడ బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో ఫుల్ బాటిల్‌కు రూ.4వేల వరకు పలుకుతోంది. దీంతో స్థానికంగా దొరికే నాటుసారాకు ఫుల్ గిరాకీ పెరిగింది. ఫలితంగా నాటుసారా అమ్మకాలు జోరందుకున్నాయి. దాంతో నాటుసారా తయారీదారులు పెద్దఎత్తున తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే నూజండ్ల మండలంలో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

మండలంలోని రాముడిపాలెం తండా గ్రామానికి చెందిన మూడవత్ బాలునాయక్, మూడవత్ శివనాయక్ నాటు సారా తయారు చేస్తున్నారనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన వెయ్యి లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేయడంతో పాటు రెండున్నర లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. తయారీదారులు ఇద్దరు పరారీ కాగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
Published by: Narsimha Badhini
First published: April 4, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading