Home /News /crime /

EXCISE OFFICER IN MADHYA PRADESH SUSPENDED FOR SHARING PROSTITUTE VIDEOS IN OFFICIAL GROUP PAH

Shocking: పోలీసు అధికారి పాడుపని.. అధికారిక వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోలు..

ఎక్సైజ్ అధికారి ఆర్.పి.అహిర్వార్ (ఫైల్)

ఎక్సైజ్ అధికారి ఆర్.పి.అహిర్వార్ (ఫైల్)

Madhya pradesh: అధికారిక వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోలు ప్రత్యక్ష మయ్యాయి. దీంతో ఆ గ్రూపులో ఉన్న మహిళా అధికారులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

కొందరు పోలీసులు తరచుగా వివాదాల్లో ఉంటున్నారు. ఇప్పటికే ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను, యువతులను వేధించిన సంఘటనలు వార్తలలో నిలిచాయి. అదే విధంగా మరికొన్ని చోట్ల అధికారులు స్టేషన్ లోనే బాధితులపై అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొందరు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకుని మహిళలను తమ కోరిక తీర్చాలంటూ వేధిస్తుంటారు. వీరంతా సభ్య సమాజం ముందు తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. నేరాలను అదుపు చేసి, ప్రజలకు భరోసా కల్పించాల్సిన వారే పాడు పనులు చేస్తు వార్తలలో ఉంటున్నారు. కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ డిపార్ట్ మెంట్ అంతటికి చెడ్డపేరు వస్తుంది. ఈ కోవకు చెందిన మరో ఉదంతం వెలుగు లోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh)  జరిగింది. ఖండ్వాలోని ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారిక వాట్సప్ గ్రూప్ లో మే 23వ కొన్ని అశ్లీల వీడియోలు ప్రత్యేక మయ్యాయి. కాగా, సాయంత్రం గం. 6-15 సమయంలో జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.పి.అహిర్వార్ ఎక్సైజ్ శాఖ అధికారిక వాట్సప్ గ్రూప్ లో అశ్లీల వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తిరిగి 24 గంటల తర్వాత అది డిలీట్ చేయబడింది. ఆ వీడియో చూసిన డిపార్ట్ మెంట్ లోని మహిళా ఉద్యోగినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అధికారుల విచారణలో కావాలని తప్పుచేసినట్లు తేలటంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారి వికాస్ మంద్లోయ్ తెలిపారు. అయితే, దీనిపై ఎక్సైజ్ అధికారి మరో రకంగా తన వాదనలు వినిపిస్తున్నారు. తాను ఆఫీస్ లో మొబైల్ ఫోన్ ను పెట్టి వాష్ రూమ్ కు వెళ్లినప్పుడు కావాలనే ఎవరో ఇలా చేశారని అహిర్వార్ అన్నారు. తనను కావాలనే ఈ విధంగా ఇరికించారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఇటు పోలీసులు, అటూ ఎక్సైజ్ శాఖలోనే తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా ఒక కోడలు అత్తపై దారుణానికి ఒడగట్టింది.

మధ్య ప్రదేశ్ (Madhya pradesh) లోని దామోహ్ జిల్లా దారుణం జరిగింది. కొడియా గ్రామంలోని హట్టా ప్రాంతంలో ఓ కోడలు తన అత్తను అత్యంత దారుణంగా కొట్టి చంపింది. కొడియా గ్రామంలో నివసిస్తున్న అజయ్ బర్మన్ అనే యువకుడు తన తల్లి నన్నీబాయితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అజయ్ బర్మన్ కు, మరో యువతితో పెళ్లయింది. అయితే, కోడలు ఎప్పుడు చూసిన ఫోన్ లోనే ఉండేది. దీంతో అత్త నన్నీబాయి విసిగిపోయింది. పద్ధతి మార్చుకొవాలని సూచించింది. కానీ ఆమె మారలేదు. పైగా అత్తపై కోపం పెంచుకుంది.ఎలాగైన అత్తను తప్పించాలను కుంది. ఒక రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

కోడలు.. కోపంతో అత్తను కర్రలతో,రాడ్ లతో ఇష్టమోచ్చినట్లు కొట్టింది. దీంతో ఆమె రక్తపుమడుగులో (Brutally murdered) కింద పడింది. ఆ తర్వాత.. కోడలు తన భర్తకు ఫోన్ చేసింది. అత్త, ఎక్కడో పడి గాయాలతో ఇంటికి వచ్చిందని కట్టుకథ అల్లింది. దీంతో అతను వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తన తల్లి చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించారు దీంతో ఆమె నిజాన్ని ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

,
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Madhya pradesh, Police Case

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు