టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు, సూత్రధారిగా భావిస్తున్న కెల్విన్‌పై ఎక్సైజ్‌శాఖ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి కెల్విన్ కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాడని పేర్కొంది. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని వెల్లడించింది. సినీతారలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్టు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చాడని.. అయితే కెల్విన్ వాంగూల్మం నమ్మశక్యంగా లేదని ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలు ఆధారాలుగా భావించలేమని పేర్కొంది. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్‌ఎల్ చెప్పిన విషయాన్ని ఎక్సైజ్‌శాఖ తన ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. అయితే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ఎక్సైజ్‌శాఖ చెబుతున్నప్పటికీ.. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై (ఈడీ)ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడుతుండటంతో.. ఆ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
2017లో ఎక్సైజ్ సిట్ దర్యాప్తు చేసిన కేసులో చార్జిషీట్ దాఖలు చేయగా.. రంగారెడ్డి ఎక్సైజ్ కోర్టులో సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. 16 మంది సినీ ప్రముఖులు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలో సిట్ పొందుపరిచింది. అయితే వారి నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని లేకపోవడంతో 16 మంది సినీ ప్రముఖులకు ఫోరెన్సిక్ ల్యాబ్ క్లీన్ చిట్ ఇచ్చారు. సినీ ప్రముఖులు ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. విచారణ సమయంలో 16 మంది దగ్గర నుంచి చేతి వేళ్ళ గోర్లు వెంట్రుకలు రక్తనమూనాలను సేకరించి ఎక్సైజ్ అధికారులు ఎఫ్ఎస్ఎల్ పంపారు. 16 మంది సినీ ప్రముఖుల నమూనాల్లో డ్రగ్స్ ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ పేర్కొంది. అయితే ఈడీ రంగంలోకి దిగడంతో.. ఈ కేసు విచారణ మరోసారి తెరపైకి వచ్చింది.
Green Chilli: పచ్చి మిర్చిను దూరం పెడుతున్నారా ?..ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు
Revanth Reddy: యముడి గెటప్‌లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
మరోవైపు డ్రగ్స్ కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. అయితే దీనిపై కేటీఆర్‌కు కూడా అదే స్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై రేవంత్, కేటీఆర్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Tollywood drugs case