Home /News /crime /

EX UTTARAKHAND MINISTER RAJENDRA BAHUGUNA KILLS HIMSELF DAYS AFTER DAUGHTER IN LAW S CHARGE PAH

Shocking: సూసైడ్ చేసుకున్న కాంగ్రెస్ మాజీ మంత్రి.. కారణం ఏంటంటే..

 రాజేంద్ర బహుగుణ (ఫైల్)

రాజేంద్ర బహుగుణ (ఫైల్)

Uttarakhand: తనపై కోడలు లైంగిక ఆరోపణలు చేయడాన్ని మంత్రి భరించలేక పోయాడు. ఈ క్రమంలో మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కాడు.

ఉత్తరాఖండ్ కు (Uttara khand) చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణపై (59) (Rajendra bahuguna) ఆమె కోడలు లైంగిక ఆరోపణలు చేశారు. తన కూతురుని, రాజేంద్ర బహుగుణ లైంగికంగా వేధించారని మూడు రోజుల క్రితం కోడలు కేసు పెట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజేంద్ర శుక్రవారం ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కాడు. అక్కడ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు (suicide) పాల్పడ్డాడు.

బహుగుణ ఇంటిమీద ఎక్కారు. అప్పుడు ఇంటి సభ్యులు పొలీసులకు సమాచారం అందించారు. తాను అమాయకుడినని, ఎలాంటి తప్పు చేయలేదని అన్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దిగి రావాలని మైకులో కోరారు. ఇంతలో బహుగుణ తుపాకీ తీసి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.కాగా, తన కూతురిని మామ రాజేంద్ర బహుగుణ లైంగికంగా వేధించాడని (allegations) కోడలు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో.. ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఆయనను కొంత మంది స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మొదట పోలీసులు అక్కడికి చేరుకుని లౌడ్ స్పీకర్లలో అరుస్తూ కిందికి దిగిరావాలని కోరారు . ఆయన ఎలాంటి తప్పు చేయలేనన్నారు. ఒకానోక సమయంలో ఆయన కిందకు వస్తారని అనుకున్నారు. కానీ అంతలోనే గన్ తీసి ( Kills Himself) కాల్పుకున్నారు. ఘటన తర్వాత మంత్రి కుమారుడు.. తన భార్యపై, ఆమె తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఒత్తిడి చేయడం వలన తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Congress, Suicide, Uttarakhand

తదుపరి వార్తలు