షాద్‌నగర్ నిర్భయ కేసుపై స్పందించిన మాజీ మంత్రి గంటా

దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు గంటా.

news18-telugu
Updated: December 1, 2019, 10:31 AM IST
షాద్‌నగర్ నిర్భయ కేసుపై స్పందించిన మాజీ మంత్రి గంటా
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)
  • Share this:
షాద్‌నగర్ వెటర్నరీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. యువతిపై దాడికి దిగిన ఉన్మాదులను కఠినంగా శిక్షించాలన్నారు. నిర్భయ ఘటనపై ప్రజలు స్పందించిన తీరు పోలీస్ స్టేషన్లపై దాడి చెయ్యడం గమనిస్తే ప్రజలు ఎంత ఆగ్రహానికి గురయ్యారో అర్థం అవుతుందన్నారు. ప్రజలు శాంతించి, భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు గంటా. ఇవాళ ఉదయం తిరుమల స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు గంటా. తన జన్మదిన సందర్భంగా మిత్రులతో కలిసి స్వామివారి ఆశీస్సులకోసం తిరుమలకు వచ్చానన్నారు.



First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>