• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • EX LOVERS RELATIONSHIP LEADS TO TRAGIC ENDING IN WARANGAL URBAN DISTRICT SSR

EX Lovers: లాక్‌డౌన్‌ వల్ల భార్యాపిల్లలతో సొంతూరికి క్యాబ్ డ్రైవర్.. ఊళ్లో కనిపించిన మాజీ లవర్.. చివరకు ఏమైందంటే..

రాజు, రమ్య (ఫైల్ ఫొటోలు)

వరంగల్ అర్బన్ జిల్లాలోని అంబాలకు చెందిన రమ్య(29), రాజు(30) పదేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అభ్యంతరం తెలిపారు. దీంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే.. పెళ్లికి అడ్డంకులు ఎదురవడంతో పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

  • Share this:
    వరంగల్ అర్బన్: ప్రేమ కథలన్నీ సుఖాంతాలు కావు. నిజ జీవితంలో ప్రేమకు కులం, మతం, ధనం, పేదరికం, పెద్దరికం, సమాజం, పరువుప్రతిష్ట.. ఇలా సవాలక్ష అడ్డంకులు ఎదురవుతాయి. వీటన్నింటినీ దాటుకుని పెళ్లి వరకూ వెళ్లే ప్రేమ కథలు చాలా తక్కువ. మిగిలిన ప్రేమికులంతా భగ్న ప్రేమికులుగానే మిగిలిపోతుంటారు. వేరే వాళ్లను పెళ్లి చేసుకుని.. ఆ భాగస్వామి మంచిగా చూసుకుంటే పాత ప్రేమను మర్చిపోతారు. లేని పక్షంలో.. ప్రేమించిన వాళ్లను తలచుకుని బాధపడుతుంటారు. అయితే.. వేరువేరు పెళ్లిళ్లు చేసుకున్న ఆ మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారంటే అనర్థాలు తప్పవు. వరంగల్ అర్బన్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లాలోని అంబాలకు చెందిన రమ్య(29), రాజు(30) పదేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అభ్యంతరం తెలిపారు. దీంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే.. పెళ్లికి అడ్డంకులు ఎదురవడంతో పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రమ్యకు వెలగొండకు చెందిన తిరుపతి అనే యువకుడితో పెద్దలు పెళ్లి చేశారు. రమ్య భర్త పెళ్లయిన కొంత కాలానికి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. రమ్యకు తొమ్మిదేళ్ల వయసున్న కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. ఇక.. రాజుకు కూడా భూపాలపల్లి జిల్లా చల్వాయికి చెందిన మహిళతో వివాహమైంది. రాజు హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యాపిల్లలతో కలిసి ఉండేవాడు. రాజుకు కూడా ఇద్దరు మగ పిల్లలు.

    ఇదిలా ఉండగా.. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన రమ్య భర్త మద్యానికి బానిసై కొన్ని నెలల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అప్పటి నుంచి రమ్య అంబాలలోని పుట్టినింటికి వచ్చి అక్కడే పిల్లలతో ఉంటోంది. హైదరాబాద్‌లో ఉంటున్న రాజు లాక్‌డౌన్ కారణంగా భార్యాపిల్లలతో అంబాలకు వెళ్లాడు. ఈ క్రమంలోనే.. రమ్య భర్త చనిపోయాడని, ఆమె పుట్టింటికి వచ్చి పిల్లలతో ఉంటుందని రాజుకు తెలిసింది. ఇంకేముంది.. పాత ప్రేమ మళ్లీ చిగురించింది. రమ్యను కలిసి ఆమెతో మాట్లాడాడు.

    ఇది కూడా చదవండి: Wife Affair: వివాహేతర సంబంధం వల్ల బిడ్డను కని.. ఆ విషయం నైట్ డ్యూటీకెళ్లిన భర్తకు తెలియకుడదని..

    ఈ క్రమంలో.. రాజుకు, అతని భార్యకు మధ్య గొడవలు తలెత్తి ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో.. రమ్య, రాజు మరోసారి దగ్గరయ్యారు. ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఈ విషయం ఇరు కుటుంబాల వాళ్లకు తెలిసి ఇద్దరినీ మందలించారు. ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. రమ్య కుటుంబం రాజుపై అనుమానంతో కమలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల దర్యాప్తు జరుగుతుండగానే రమ్య, రాజు మృతదేహాలు ధర్మారం శివారులోని చెరువుకుంటలో కనిపించాయి. కలిసి బతికేందుకు ఈ సమాజం, రెండు కుటుంబాలు ఒప్పుకోవనే ఉద్దేశంతోనే కలిసి చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: