EX HUSBAND BROTHER AND FOUR OTHERS GANG RAPED A WOMAN IN FRONT OF HER SECOND HUSBAND IN RAJASTHAN HSN
భర్తను కట్టేసి భార్యపై ఐదుగురు వ్యక్తుల అత్యాచారం.. ఈ దారుణానికి తెగించిన వ్యక్తి స్వయానా ఆమెకు..
ప్రతీకాత్మక చిత్రం
ఓ వివాహితపై అయిదుగురు కామాంధులు మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. ఆమె భర్తను బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి మరీ ఈ దారుణానికి తెగించారు. అసలేం జరిగిందంటే..
నిర్భయ, దిశ వంటి ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా కామాంధులు నిర్భయంగా రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. వావీ వరుసలు లేకుండా అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. అక్క, చెల్లి, పిన్ని, అత్త, కోడలు, కూతురు.. అన్న బంధంతో సంబంధం లేకుండా మృగాళ్లు మానవత్వం లేకుండా చెలరేగిపోతున్నారు. మానవ సంబంధాలకే మాయని మచ్చను తెస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ వివాహితపై అయిదుగురు కామాంధులు మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. ఆమె భర్తను బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి మరీ ఈ దారుణానికి తెగించారు. తన కళ్ల ముందే భార్యను అత్యాచారం చేయడంతో అతడు కన్నీటిపర్యంతమవుతున్నాడు. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని బారాన్ నగరానికి దగ్గరలో ఓ ఊళ్లో ఓ భార్యాభర్తలు కాపురం ఉంటున్నారు. శనివారం ఈ దంపతులిద్దరూ బారాన్ లోని బాలాజీ దేవాలయానికి వెళ్లారు. బైక్ పై వాళ్లిద్దరూ తిరిగొస్తుండగా ఓ అయిదుగురు వ్యక్తులు మార్గమధ్యంలో వారిని అడ్డుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డులోంచి పొలాల్లోకి వారిని తీసుకెళ్లారు. అక్కడ ఆ భర్తను బెదిరించి, భయపెట్టి దాడి చేశారు. ఆ తర్వాత అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. ఆ మహిళపై ఆ అయిదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు.
అక్కడే వారిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఓ వ్యక్తి ఆమెకు తెలిసిన వాడే కావడం గమనార్హం. తన మాజీ భర్త సోదరుడే ఈ ఘటనకు సూత్రధారి కావడం శోచనీయం. ఈ ఘటన గురించి అందరికీ చెప్తే మీ పరువే పోతుందనీ, ఆలోచించుకోమని చెప్పి మరీ వెళ్లారు. ఈ ఘటన షాక్ నుంచి తేరుకున్న ఆమె తన భర్తతో కలిసి సర్దార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.