• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • EX CHHATTISGARH MINISTERS DAUGHTER IN LAW AND GRAND DAUGHTER KILLED FOR PROPERTY SRD

Crime : షాకింగ్...ఆస్తి కోసం మాజీ మంత్రి కోడలు, మనవరాల్ని దారుణంగా చంపేశారు...

Crime : షాకింగ్...ఆస్తి కోసం మాజీ మంత్రి కోడలు, మనవరాల్ని దారుణంగా చంపేశారు...

ప్రతీకాత్మక చిత్రం

Crime : మానవత్వం మంటగలిసి పోతుంది. రాక్షసత్వం రాజ్యమేలుతుంది. రక్త సంబంధాలు కూడా మరిచిపోతున్నారు. ఆస్తి కోసం బంధాల్ని మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనే ఛత్తీస్ గఢ్ లో జరిగింది.

  • Share this:
    మానవత్వం మంటగలిసి పోతుంది. రాక్షసత్వం రాజ్యమేలుతుంది. రక్త సంబంధాలు కూడా మరిచిపోతున్నారు. ఆస్తి కోసం బంధాల్ని మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనే ఛత్తీస్ గఢ్ లో జరిగింది. దివంగత నేత చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి డీపీ ధ్రిత్‌లహ్రే కోడలు(30), తొమ్మిదేళ్ల మనవరాలు దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో సమీప బంధువులే వీరిని చంపినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాయ్‌పూర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దివంగత ధ్రిత్‌లహ్రే కొడుకు తరుణ్ ధ్రిత్‌లహ్రే, కోడలు నేహా ధ్రిత్‌లహ్రే, వారి కూతురు అనన్య(9) రాయ్‌పూర్‌లోని శంకర్‌నగర్‌లో నివాసముంటున్నారు. అయితే తరుణ్ ధ్రిత్‌లహ్రే ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అతని భార్య నేహా, కుమార్తె అనన్యలపై దుండగులు దాడి చేసి చంపేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని చెప్పారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ధ్రిత్‌లహ్రే కు చాలా ఆస్తులున్నాయని.. వీటి కోసం సమీప బంధువులు, ఆయన కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.

    మరోవైపు ఆఖ‌రి రోజుల్లో భార్య స‌హ‌చ‌ర్యంలో కాలాన్ని గ‌డ‌పాల్సిన ఓ వృద్ధుడు చివ‌ర‌కు ఆమెనే అంత‌మొందించాడు. కాటికి కాళ్లు చాపిన వయసులో కర్కశంగా ప్రవర్తించాడో భర్త. జీవిత‌పు చ‌ర‌మాంకంలో క‌ట్టుకున్న భార్య‌ను అతి కిరాత‌కంగా హ‌త్య చేసి, శ‌వాన్ని కూడా త‌గుల‌బెట్టి, సాక్ష్యం లేకుండా చేద్దామ‌నుకున్నాడు. చివ‌ర‌కు కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించ‌డంతో అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని డోంబివ్లిలోని పాండురంగ్ వాడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. డోంబివ్లిమున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ రామకాంత్ పాటిల్ కుటుంబం పాండురంగ్ వాడి ప్రాంతంలో నివాస‌ముంటోంది. ఆదివారం ఉద‌యం.. అత‌ని తండ్రి బలరామ్ పాటిల్(84).. త‌న భార్య‌ పార్వ‌తి(80)ని బెడ్ రూమ్‌లో క‌త్తితో ప‌లుమార్లు పొడిచి, దారుణంగా హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత శ‌వాన్ని త‌గుల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే బెడ్‌రూమ్ నుంచి ద‌ట్ట‌మైన‌ పొగ రావడం గ‌మ‌నించిన రమాకాంత్ భార్య‌ వెంట‌నే అత‌న్ని నిద్ర‌లేపింది. వెంట‌నే ర‌మాకాంత్ ప‌రుగెత్తుకొని వ‌చ్చి ఆ గ‌దివైపు వెళ్లి చూడ‌గా.. గ‌దిలో అత‌ని తల్లి పార్వ‌తి తీవ్రమైన‌‌ క‌త్తిపోట్ల‌కై గురై, శవంగా క‌నిపించింది. అత‌ని తండ్రి మాత్రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడ‌ని తెలుసుకొని.. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.
    Published by:Sridhar Reddy
    First published: