Andhra Pradesh: డ్యాన్సర్ ఆత్మహత్యలో ట్విస్ట్..! వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

భర్తతో గాయత్రి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కృష్ణా జిల్లా (Krishna District) విజయవాడలో (Vijayawada) మహిళా డ్యాన్సర్ సూసైడ్ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధంమే (Extra Marital Affair) ఇందుకు కారణంగా తేల్చారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, విజయవాడలో మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం బయటపడటంతో భర్తకు మొహం భర్తకు మొహం చూపించలేక బలవన్మరణానికి పాల్పడ్డట్లు తేల్చారు. వివరాల్లోకి వెళ్తే.. వాంబే కాలనీకి చెందిన గాయత్రీ దేవి పాలిటెక్నిక్ చదివింది. 10ఏళ్ల క్రితం సతీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వృత్తి రిత్యా డ్యాన్సర్ అయిన ఆమె.. పలు పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో డ్యాన్స్ షోల్లో పాల్గొంటూ ఉంటుంది. భర్తతో కూడా ఏలాంటి విభేదాలు లేకపోవడం, అతను ప్రేమగా చూసుకుంటాడని తెలియడంతో ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారించారు. వివాహేతర సంబంధమే ఆమె ప్రాణాలు తీసినట్లు వెల్లడైంది.

    ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
    ఈవెంట్లు చేసే క్రమంలో తాను పనిచేసే డాన్స్ ట్రూప్ లో సునీల్ అనే వ్యక్తితో గాయత్రికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సునీల్ భార్యకు తెలిసింది. సునీల్-గాయత్రి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ మెసేజ్ లు చూసిన నీలిమ.. గాయత్రిని అడిగేందుకు ఇంటికొచ్చింది.ఇదే సమయంలో భర్త సతీష్ ను పిల్లల్ని బయటకు పంపేసింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నీ సంగతి తేలుస్తా అంటూ నీలిమ అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధం వ్యహారం బయటపడటం, ప్రేమగా చూసుకునే భర్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

    అన్ని కోణాల్లో విచారణ
    గాయత్రి ఆత్మహత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటికే నీలిమతో పాటు ఆమె భర్త సునీల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సునీల్-గాయత్రి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు, కాల్ రికార్డులను కూడా సేకరించారు. భర్త, తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఆందోళనతో సూసైడ్ చేసుకుందని తెలిపారు. కుటుంబ సభ్యులు, డ్యాన్స్ ట్రూప్ సభ్యులను కూడా విచారిస్తున్నట్లు చెప్పారు.
    Published by:Purna Chandra
    First published: